మెదక్ లో భారీ రోడ్ షో ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
మెదక్ లో భారీ రోడ్ షో ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
జన చైతన్య న్యూస్ పటాన్చెరు ప్రతినిధి ఈ. భాస్కర్
శనివారం నాడు మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు నామినేషన్ దాఖలు చేయనున్న సందర్భంగా భారీ రోడ్ షో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , మంత్రివర్యులు దామోదర రాజనర్సింహ, కొండ సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, డిసిసి ప్రెసిడెంట్ నిర్మల జగ్గారెడ్డి, పటాన్చెరు అసెంబ్లీ కోఆర్డినేటర్ శ్యామ్ గౌడ్, పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ పాల్గొని మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ని భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.