వేసవికాలంలో బాలిక చేతిలో సెల్ఫోన్ పేలుడు-తస్మాత్ జాగ్రత్త

వేసవికాలంలో  బాలిక చేతిలో సెల్ఫోన్ పేలుడు-తస్మాత్ జాగ్రత్త

పల్నాడుజిల్లా పెదకూరపాడులో  బాలిక చేతిలో  సెల్ఫోన్ పేలుడు

విజయవాడ- జన చైతన్య (రుషిత్ కుమార్)

వేసవి సెలవులు కావడం తో సెల్ తో ఆడుకుంటున్న బాలిక శడెన్ గా సెల్ ఫోన్ పేలి బాలిక చేయి ఛిద్రం అయిన వైనం. సెల్ ఫోన్ పేలి 11 ఏళ్ల బాలికకు తీవ్ర గాయాలైన ఘటన పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం ఎమ్మాజీగూడెంలో చోటు చేసుకుంది.కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. కుంచాల వెంకటేశ్వరరావు కుమార్తె వీరలక్ష్మి అయిదో తరగతి చదువుతోంది. శనివారం ఇంట్లో సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి వీడియోలు చూస్తుండగా పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఈ ప్రమాదంలో బాలిక కుడిచేతి రెండు వేళ్లు పూర్తిగా తెగిపోయాయి. వెంటనే 108కు సమాచారమిచ్చి గుంటూరు వైద్యశాలకు తరలించారు.