అవనిలో అమృతం అమ్మ పాలు బిడ్డకు శ్రేష్టం
అవనిలో అమృతం అమ్మ పాలు బిడ్డకు శ్రేష్టం
జనచైతన్య న్యూస్- తనకల్లు
సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం మల్రెడ్డిపల్లి, గేమా నాయక్ తాండ గ్రామాల పరిధిలో ఘనంగా తల్లిపాలు వారోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐ సి డి ఎస్ సూపర్వైజర్ లక్ష్మీ దేవమ్మ, ఆధ్వర్యంలో జరిగింది. సూపర్వైజర్ లక్ష్మీ దేవమ్మ మాట్లాడుతూ అవనిలో అమృతం అమ్మ పాలు అన్నారు, పుట్టిన ప్రతి చంటి బిడ్డకు అమ్మ పాలు సంపూర్ణ ఆరోగ్యానికి పునాది, అని ప్రతి తల్లి బిడ్డకు మురిపాలు పట్టాలని, మురిపాలు పట్టేందుకు ప్రతి తల్లి సం సిద్దుత అయ్యి ఉండాలని, ఆరు నెలలు వరకు అమ్మ పాలు మాత్రమే బిడ్డ ఎదుగుదలకు ఉపయోగమని గర్భవతిగా ఉన్నప్పుడే తల్లి సంపూర్ణ ఆహారం తీసుకోవాలని ప్రసవ సంసిద్ధంతో ఉండాలని అన్నారు. మహిళ కార్యదర్శి రిహానా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి తల్లులు ప్రభుత్వం అంగన్ వాడి కేంద్రాలకు సరఫరా చేస్తున్న పౌష్టిక ఆహారం తీసుకుంటేనే బిడ్డకు వయసుకు తగ్గ ఎత్తు బరువు మేధాశక్తి కలిగి ఉంటుందని, ప్రతి తల్లి తన పిల్లలను అంగన్ వాడి కేంద్రాల్లో పంపాలని అంగన్వాడీలో పిల్లలకు ఆటపాటలతో విద్య నేర్పిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, గర్భవతులు, బాలింతలు, సచివాలయ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, శ్రీదేవి, అంగన్వాడి కార్యకర్తలు భాగ్యమ్మ, పద్మావతి, శోభ, స్వరూప, సాయి లక్ష్మి, సుశీల, ఆదిలక్ష్మి, అమరావతి, ఈశ్వరమ్మ మహిళ కార్యదర్శి, ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.