జులై 7న జరిగే 30 సంవత్సరాలు మాదిగల ఆత్మబోధ కవితలు జయప్రదం చేయండి

జులై 7న జరిగే 30 సంవత్సరాలు మాదిగల ఆత్మబోధ కవితలు జయప్రదం చేయండి

జులై 7న జరిగే 30 సంవత్సరాలు మాదిగల ఆత్మబోధ కవితలు జయప్రదం చేయండి

జనచైతన్య న్యూస్ -పెద్దవడుగూరు 

అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెద్దవడుగూరు మండలం లో మహాజన నేత ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్య మందా కృష్ణ మాదిగ ఆదేశం మేరకు 30వ మాదిగల ఆత్మగౌరవ ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్ లో జూలై 7వ తారీఖున మాదిగల ఆత్మగౌరవ కవత్తును నిర్వహించడానికి అలాగే మాదిగలను చైతన్యం కొరకు అనంతపురం జిల్లా తాడపత్రి నియోజకవర్గ పరిధిలోని పెద్దవడుగూరు మండల నాయకులతో 24 జూన్ 2024 తేదీన పెద్దవడుగూరు మండలం కేంద్రంలో పేట శివాలయంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ, జాతీయ నాయకులు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దపప్పూరు టీ ఆదినారాయణ మాదిగ పాల్గొని ఆయన మాట్లాడుతూ వచ్చేనెల జూలై 7వ తేదీన వరంగల్లులో మాదిగల ఆత్మగౌరవ కవత్తును జయప్రదం చేయడానికి మండల పరిధిలోగల అన్ని గ్రామాలలో జెండా దిమ్మలు నిర్మించాలని మాదిగలను చైతన్యవంతం చేసి కవాతును పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునివ్వడం జరిగినది. ఈ కార్యక్రమం లో ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుడిష భూపతి మాదిగ, జిల్లా కార్యదర్శి కత్తుల కొండయ్య మాదిగ, మండల ఉపాధ్యక్షుడు అంజి, అలియాస్ ఆంజనేయులు మాదిగ, ఈరన్నపల్లి రంగడు మాదిగ, వడుగురు సింగన్న మాదిగ, రామాంజనమ్మ, లాలప్ప,  మల్లికార్జున, లక్ష్మీనారాయణ, జయప్ప, భగీరప్ప, వెంకమ్మ,  ఎల్లమ్మ,  రామాంజనమ్మ, వీరమ్మ, నారాయణస్వామి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.