మాన్య మందకృష్ణ మాదిగ సైన్యం

మాన్య మందకృష్ణ మాదిగ సైన్యం

మాన్య మందకృష్ణ మాదిగ సైన్యం

జనచైతన్య న్యూస్-పెద్దవడుగూరు 

 అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెద్దవడుగూరు మండల కేంద్రంలో 24 జూన్ 2024 ఉన్నటువంటి యూనియన్   బ్యాంక్ మేనేజర్ సిబ్బంది రైతులు ఖాతాదారుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మాదిగ దండోరా ఆధ్వర్యంలో బేత శివాలయం వద్ద నుండి వివిధ గ్రామాల రైతులు ఎంఆర్పిఎస్, ఎం ఎస్పీ కార్యకర్తలు ర్యాలీగా ముఖ్యఅతిథిగా ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు అనంతపురం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దపప్పూరు ఆదినారాయణ మాదిగ, కుమార్ స్వామి మాదిగ, జిల్లా ప్రధాన కార్యదర్శి గుత్తి ఈరన్న మాదిగ, జిల్లా ప్రధాన కార్యదర్శి భూపతి మాదిగ, జిల్లా కార్యదర్శి కత్తుల కొండయ్య మాదిగ, వీరి ఆధ్వర్యంలో యూనియన్ బ్యాంకు వరకు రైతులు దళితుల పట్ల బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం విడనాడాలని నినాదాలతో రైతులకు ఖాతాదారులకు నీడని ఏర్పాటు చేయాలని త్రాగునీటిని ఏర్పాటు చేయాలని ఖాతాదారులకు సౌకర్యాలు కల్పించాలని ముద్ర లోన్లు రైతులకు ప్రత్యేక కౌంటర్లు మహిళలకు, జెంట్స్ కు సపరేటుగా కేటాయించాలని నినాదాలు చేసుకుంటూ బ్యాంకు వరకు వచ్చి బ్యాంకు ముందర ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దపప్పూరు టీ ఆదినారాయణ మాదిగ మాట్లాడుతూ బ్యాంకు నందు గ్రాఫ్ లోన్లు కిసాన్ క్రెడిట్ కార్డ్ లోన్లు వ్యక్తిగత లోన్లు అలాగే వికలాంగులు ఇబ్బందులు పడుతున్నారు, ముసలి వాళ్లు మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.ఇవన్నీ మాకు సక్రమంగా పాటించవలెను కౌంటర్ నందు తీసుకొనుటకు ఒక కౌంటర్, జమ చేయడానికి ఒక కౌంటర్, ఏర్పాటు చేయాలని మహిళా ఖాతాదారులకు ప్రత్యేక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని ఖాతాదారులకు త్రాగునీరు ఏర్పాటు చేయాలని అలాగే రాజకీయ నాయకులకు బ్యాంకు సిబ్బంది అధిక ప్రాధాన్య ఇస్తున్నారని సాధారణ ఖాతాదాలకు రైతులకు ఇబ్బందులు పెడుతున్నారని క్రాప్ లోన్లు గేట్ అయిపోయిన ఒకరోజు ఆలస్యమైన వడ్డీ రాదని ఎక్కువ అమౌంట్ పెంచమని ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, రైతులు బయట దళారుల దగ్గర వడ్డీకి తెచ్చి బ్యాంకులో కత్తి బ్యాంకు వడ్డీ దళారుల వడ్డీ రెండు కట్టలేక బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని బ్యాంకు నుండి సంవత్సరం క్రాప్ లోను రెన్యువల్ చేసుకుంటున్నారు, మరియు ఇన్సూరెన్స్ కట్టించుకుంటున్నారు, రైతు పేరుతో కూడా ఇన్సూరెన్స్ సంవత్సరం సంవత్సరం కట్టించుకుంటున్నారు.ఏ ఒక్క రైతుకు కూడా న్యాయం జరిగిన పాపాన పోలేదు,  అన్నిటిని కూడా న్యాయం చేయకపోతే మరీ కూడా జులై నెలలో యూనియన్ బ్యాంకు ముందు బ్యాంకు పరిధిలో గ్రామాలన్నీ కూడా రైతులను ఖాతాదారుల పిల్లలకి ఎస్సీ,  ఎస్టీ, బీసీ మైనార్టీలతో కలుపుకొని పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని తెలియజేస్తున్నాం, ఈ కార్యక్రమంలో బి అంజి, అలియాస్,  ఆంజనేయులు, మల్లికార్జున,లక్ష్మీనారాయణ, జయప్ప, లాలప్ప, అకిరప్ప, రంగన్న, వెంకమ్మ, ఎల్లమ్మ, రామాంజనేయులు,  రామాంజనమ్మ, ఈశ్వరమ్మ, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.