విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ లో ఆత్మహత్య
విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఆత్మహత్య
విజయవాడ-జన చైతన్య (తమ్మిన గంగాధర్) విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. ఆసుపత్రి పైనుండి దూకి యువకుడి ఆత్మహత్య
గోప్యంగా ఉంచి పోస్టుమార్టం నిర్వహించిన ఆసుపత్రి సిబ్బంది. విజయవాడ కొత్త ప్రభుత్వాసుపత్రిలో చికిత్స కోసం చేరిన కంచికచర్లకు చెందిన ఓ యువకుడు ఆదివారం రాత్రి రెండో అంతస్తు నుంచి కిందకు దూకి చనిపోయాడని తెలిసింది. ఈ ఘటన గోప్యంగా ఉంచి పోస్టుమార్టం చేసి అతడి బంధువులకు మృతదేహాన్ని అప్పగించినట్టు సమాచారం. ఆసుపత్రిలో వైఫల్యాలు బయటపడతాయనే ఎవరికీ చెప్పకూడదని సిబ్బంది, బాధితుడి బంధువులనూ బెదిరించినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం. కంచికచర్లకు చెందిన సురేష్(30) వారం కిందట మెడకోసుకునిఆత్మహత్యాయత్నం చేయగా, అతని బంధువులు కాపాడి విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తెచ్చారు. ఆసుపత్రి బి బ్లాక్ రెండో అంతస్తులో జనరల్ మెడిసిన్కు చెందిన ఎంఎం2 వార్డులో చికిత్స పొందుతూ కోలుకుంటున్నాడు. ఆదివారం అర్ధరాత్రి బాధితుడికి తోడుగా ఉన్న అతని బంధువు టీ తాగడానికి కిందకు వెళ్లాడు. అప్పుడు వార్డులో సిబ్బంది ఒక్కరు కూడా లేకపోవడంతో సురేష్ బయటకు వచ్చి. బిబ్లాక్ నుంచి సీబ్లాక్కు వెళ్లేందుకు మధ్యలో ఉన్న ఇనుప పుస్ఓవర్ బ్రిడ్జిపైనుంచి కిందకు దూకి ప్రాణాలు వదిలాడు.