వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించేందుకు యువత సిద్దంగా ఉన్నారు
కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గం తోట్ల వల్లూరు మండలం
వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించేందుకు యువత సిద్దంగా ఉన్నారు
- వల్లూరి కిరణ్ ప్రెస్ మీట్
ఎన్నికలకు ముందు 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అన్న జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పి నిరుద్యోగుల్ని నిలువునా ముంచారని టీడీపీ యువనేత వల్లూరి కిరణ్ మండిపడ్డారు. గురువారం నాడు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.....జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 5 ఏళ్ల ముగుస్తున్నా...ఇంతవరకు ఒక్క జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు. మెగా డీఎస్సీ అన్న జగన్ రెడ్డి..ఐదేళ్లలో కనీసం ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదు. వైసీపీ పాలనలో యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు లేక నిరాశ నిసృహలో కూరుకుపోయారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక ప్రకారం గ్రాడ్యుయేట్లలో 24 శాతం నిరుద్యోగంతో దేశంలోనే ఏపీ ప్రధమ స్ధానంలో ఉంది. రాష్ట్రంలో పట్టభద్రుల నిరుద్యోగిత జాతీయ సగటు కంటే 11 శాతం అధికంగా ఉంది. బీహార్, పశ్చిమ బెంగాల్ రెండు రాష్ట్రాల్లో కలిపి నిరుద్యోగుల ఆత్మహత్యల కంటే ఏపీలోని నిరుద్యోగుల ఆత్మహత్యలే ఎక్కువ. నిరుద్యోగుల ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్న రాష్