ఆర్ అండ్ బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కి స్వాగతం పలికిన అబ్దుల్ అజీజ్
ఆర్ అండ్ బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కి స్వాగతం పలికిన అబ్దుల్ అజీజ్
జనచైతన్య న్యూస్- నెల్లూరు
నెల్లూరు జిల్లా పర్యటనకు విచ్చేసిన రోడ్లు, భవనాల శాఖమాత్యులు బీసీ జనార్దన్ రెడ్డి కి బోగోలు మండలం తిప్ప సెంటర్ వద్ద నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ స్వాగతం పలికారు. అనంతరం దేవాదాయ శాఖమాత్యులు ఆనం రామనారాయణ రెడ్డి, రోడ్లు మరియు భవనాల శాఖ మాత్యులు బీసీ జనార్దన్ రెడ్డి, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి లతో కలిసి జువ్వల దీన్నే ఫిషింగ్ హార్బర్ లో అధికారుల సమీక్షా సమావేశంలో పాల్గొని, సమావేశం అయ్యాక ఫిషింగ్ హార్బర్ ను సందర్శించారు. అనంతరం దగదర్తి వద్ద గల నెల్లూరు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించారు. కార్యక్రమంలో మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల కమిషనర్ సురేష్, మ్యారి టైం బోర్డు సీఈఓ ఆదిత్య, జిల్లా కలెక్టర్ ఆనంద్, కావలి ఆర్డీవో సీనా నాయక్, జిల్లా డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.