సుప్రీంకోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేసిన ఎమ్మార్పీఎస్, ఎం ఎస్ పి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ టి ఆదినారాయణ మాదిగ

సుప్రీంకోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేసిన ఎమ్మార్పీఎస్, ఎం ఎస్ పి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ టి ఆదినారాయణ మాదిగ

సుప్రీంకోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేసిన ఎమ్మార్పీఎస్, ఎం ఎస్ పి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ టి ఆదినారాయణ మాదిగ 

 జనచైతన్య న్యూస్-తాడిపత్రి

 అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సర్కిల్ దగ్గర ఎమ్మార్పీఎస్, ఎం ఎస్ పి నాయకులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలవేసి మాన్య మందకృష్ణ మాదిగ ఫోటోకి పాలాభిషేకము, బాలా సంచులతో కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ఎమ్మార్పీఎస్, ఎం ఎస్ పి అనంతపురం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దపప్పూరు ఆదినారాయణ మాదిగ, ఎమ్మార్పీఎస్ తాడపత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ యం పెద్దిరాజు మాదిగ, పెద్దపప్పూరు ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు పసల కంబగిరి మాదిగ, పెద్దపప్పూరు మండల సిపిఐ చింతా పురుషోత్తం, తాడపత్రి నియోజకవర్గ ఉపాధ్యక్షుడు తర్జుల రామాంజనేయులు మాదిగ, టౌన్ అధ్యక్షుడు రామాంజనేయులు మాదిగ, మాదిగ మహిళ రాష్ట్ర నాయకులు లక్ష్మీదేవి, తులసి పాల్గొన్నారు.  టీ ఆదినారాయణ మాదిగ మాట్లాడుతూ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎన్నో వడి దుడుకులు ఎదుర్కొనే ప్రాణ త్యాగాలు చేసి అమరులైన మాదిగ బిడ్డలకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాం మాదిగల్లో ఉండబడేటువంటి యాభై తొమ్మిది ఉప కులాలకు నేడు స్వాతంత్రం వచ్చిందని చెప్పుకోవచ్చు సుప్రీంకోర్టు ఏడుగురు జడ్జిలతో విధించిన ధర్మాసులంలో జస్టిస్ చంద్ర చూర్ నేతత్వంలో  1 ఆగస్టు 2024 చేసిన తీర్పు వెల్లడించడం చాలా సంతోషకరమైన విషయం 30 సంవత్సరాల సుదీర్ఘ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మాదిగ దండోరా ఉద్యమంలో మాదిగ బిడ్డలందరినీ ఒక్క తాటిపై నడిపించిన అభినవ అంబేద్కర్ మందకృష్ణ మాదిగ ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము. ఒక రకంగా చెప్పాలంటే అలాగా వర్గాలకు మందకృష్ణ మాదిగ దేవుడు అదే విధంగా దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ మాదిగలకు మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉన్నది. అదే విధంగా గతంలో ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  గతంలో ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగలకు న్యాయం చేశారు, ఇప్పుడు కూడా ఎస్సీ వర్గీకరణ కార్మికులంగా ఉన్నారు, ఎస్సీ వర్గీకరణకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి నాయకులు కొత్తపల్లి సర్పంచ్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.