హర్ ఘర్ తిరంగా అభియాన్ విజయవంతం చేయండి
హర్ ఘర్ తిరంగా అభియాన్ విజయవంతం చేయండి
జనచైతన్య న్యూస్ - కదిరి
సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలో 11 నుండి 15 వరకు జరిగే కార్యక్రమాలన్నింటినీ సక్సెస్ చేయాలి, ఇంటిపై జాతీయ జెండా ఎగురవేద్దాం, దేశ ఐక్యతను చాటి చెబుదాం బిజెపి కిసాన్ మొర్చ ఆర్గానిక్ సెల్ స్టేట్ కన్వీనర్ చింతా శరత్ కుమార్ రెడ్డి, భారత ప్రధాని మోదీ ఇటీవల జరిగిన మన్ కి బాత్ సందర్భంగా ప్రతి ఇంటిపై, హర్ ఘర్ తిరంగా జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారని, అలాగే పార్టీ ఆధ్వర్యంలో 11వ తేదీ నుండి 15వ తేదీ వరకు తలపెట్టిన హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బిజెపి కిసాన్ మొర్చ ఆర్గానిక్ సెల్ స్టేట్ కన్వీనర్ చింతా శరత్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చింతా శరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ హర్ ఘర్ తిరంగా అభియాన్ ప్రోగ్రాంలో భాగంగా 11 నుండి 14 వరకు తిరంగా యాత్ర చేపట్టాలన్నారు, 13 నుండి 15 వరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించాలన్నారు. ఆగస్టు 12 నుండి 14 వరకు మహనీయుల విగ్రహాలు, స్మారక చిహ్నాల చుట్టూ పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలన్నారు, ఆగస్టు 14న విభజన గాయాల స్మారక దినం జరపాలని, అందులో భాగంగా సమ్మేళనాలు సదస్సులు నిర్వహించి దేశ విభజన చీకటి అధ్యాయాన్ని స్మరించుకోవాలన్నారు .అలాగే ఆగస్టు 13 నుండి 15 వరకు అమరవీరుల స్మారక చిహ్నాలు విగ్రహాల వద్ద పుష్పాంజలి ఘటించాలని ఆయన వివరించారు. ఆగస్టు 11 నుండి 15 వరకు జరిగే వివిధ కార్యక్రమాలలో పార్టీ శ్రేణులతో పాటు అన్ని వర్గాల ప్రజలు భాగస్వామ్యులైయే విధంగా చూడాలన్నారు . ముఖ్యంగా ప్రతి ఒక్కరు తమ ఇళ్ళ మీద జాతీయ జెండాను ఎగురవేసి, సెల్ఫీ తీసుకొని హర్ గర్ తిరంగా, కామ్ లో అప్లోడ్ చేసి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారాన్ని చేపట్టాలని సూచించారు. దేశాన్ని ఒకటి చేసే ఈ అద్భుత కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములై, దేశ ఐక్యతను ప్రపంచానికి చాటి చెప్పాలని ఆయన ఈ సందర్భంగా విద్యార్థులను , మేధావులను వ్యాపారస్తులను, రైతు సంఘాలను, కార్మిక సంఘాలను, రాజకీయ నాయకులను, మహిళ సంఘాలను, కుల సంఘాలను, యువజన సంఘాలను, క్రీడా సంఘాలను, ఎన్జీవోలను, ఎక్స్ ఆర్మీ సభ్యులను, ప్రజలందరూ పెద్ద ఎత్తున భాగస్వామి కావాలని కోరారు.