ఏపీఆర్డిసి ప్రవేశానికి విద్యార్థి యశ్వంత్ ఎంపిక

ఏపీఆర్డీసి ప్రవేశానికి విద్యార్ధి యశ్వంత్ ఎంపిక
అమడగూరు మే (జనచైతన్య న్యూస్): ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ డిగ్రీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 మంగళగిరి ద్వారా మంగళవారం విడుదల చేసిన ఫలితాల్లో మండలంలోని తుమ్మలకుంట్లపల్లి పంచాయతీ ఎగువ చెర్లోపల్లి గ్రామానికి చెందిన యరమనేని రామకృష్ణ, ఇందిరమ్మ దంపతుల కుమారుడు యశ్వంత్ నాయుడు 66వ రాంక్ తో 76 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచినట్లు తెలిపారు.ఏఫ్రిల్ 25న ఏపీఆర్డీసి ప్రవేశానికి పరీక్షలు నిర్వహించగా, మంగళవారం విడుదల చేసిన ఫలితాల్లో(బీకాం ప్రవేశానికి)యరమనేని విద్యార్ధి యశ్వంత్ నాయుడు ప్రతిభతో ఎంపికైన సందర్భంగా గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థి యశ్వంత్ నాయుడు అమడగూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ సిఈసి గ్రూపులో 875 మార్కులు సాధించి కళాశాలలో ద్వితీయ స్ధానంలో నిలిచి, ఏపీఆర్డీసి ప్రవేశానికి ఎంపికపై తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తూ.... విద్యార్థికి(కుమారుడికి)స్వీట్స్ తినిపించారు,అమడగూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.ప్రభాకర్,అధ్యాపక బృందం, విద్యార్థి యశ్వంత్ నాయుడుకి అభినందనలు తెలిపారు.