పిఈటి శ్రీలత పై పిజిఆర్ఎస్ లో ఫిర్యాదు

పిఈటి శ్రీలత పై పిజిఆర్ఎస్ లో ఫిర్యాదు
జన చైతన్య న్యూస్ - వి కోట
పిఈటి శ్రీలత పై విద్యార్థిని తల్లిదండ్రులు కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే వి కోట పట్టణంలోని అంబేద్కర్ నగర్ కు చెందిన గుణ, మీనా కుమార్తె షర్మిక బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నది. తోటి విద్యార్థులు నా కుమార్తె వాష్ రూమ్ కి వెళ్ళినప్పుడు బలాత్కారంగా రెండు చేతులు పట్టుకుని కర్పూరం కుడి చేతిలో పెట్టి నిప్పు పెట్టి చేయని కాల్చివేశారు. ఈ విషయమై ప్రధానోపాధ్యాయులతో మాట్లాడుతుండగా అదే పాఠశాలలో పనిచేస్తున్న పీఈటి శ్రీలత చెప్పలేని పరుష పదజాలంతో దూషించు, నీ అంతు చూస్తామని బెదిరించి, నీ గురించి అంతా నాకు తెలుసు అని వార్నింగ్ ఇచ్చింది. నా కుమార్తెతో అప్పుడప్పుడు పిఈటి శ్రీలత చేతిలో కాల్లో నొప్పులని మసాజ్ చేపించుకునేదన్నారు. శ్రీలతపై తగు చర్యలు తీసుకుని నాకు న్యాయం చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నది.