ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కౌలేపల్లి తెలుగుదేశం కార్యకర్తలు
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కౌలేపల్లి తెలుగుదేశం కార్యకర్తలు
జనచైతన్య న్యూస్ -కదిరి రూరల్
సత్యసాయి జిల్లా కదిరి రూరల్ మండలం మొటకిపల్లి గ్రామపంచాయతీ కౌలేపల్లి క్వాటర్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెలుగుదేశం కార్యకర్తలు వారు మాట్లాడుతూ ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాదు చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే అన్ని వర్గాలకు సంక్షేమ అందుతుందన్నారు, చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలతో పేదల జీవితాల్లో మార్పు వస్తుందన్నారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టగానే మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు, దీపం పథకం కింద ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు, ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతున్న ఒక్కొక్క తల్లికి వందనం పేరుతో 15000 ఇస్తామన్నారు, ఆడబిడ్డ నిధి కింద ఇంట్లో 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ప్రతినెల రూ 1500 ఇస్తామన్నారు, యువగలం పేరుతో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని 50 ఏళ్లు నిండిన బిసి,ముస్లిం మైనారిటీలకు ప్రతినెల 4 వేల రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు. పోలింగ్ బూత్ నెంబర్ 151 లో బ్యాలెట్ నమూనా చూపించి 1 వ గుర్తు పై సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని కదిరి అభివృద్ధి కోసం కందికుంట వెంకటప్రసాదు ను గెలిపించాలని కోరుతున్నాము. ఈకార్యక్రమంలో టిడిపి కార్యకర్తలు డాక్టర్ గణేష్ కిరణ్, మాజీ సర్పంచ్ ఊరతి చంద్ర, సద్దా జయ, నరేంద్ర యాదవ్, గంగాద్రి,శ్రీరాములు, నవీన్, త్రిలోక్, శ్రీనివాసులు మరియు గ్రామం లో మహిళలు సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు