ఉమ్మడి అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ పర్యటన కార్యక్రమం

ఉమ్మడి అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ పర్యటన కార్యక్రమం

ఉమ్మడి అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ పర్యటన కార్యక్రమం 

జనచైతన్య న్యూస్-అనంతపురం 

అనంతపురం జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయము నందు జూనియర్ సహాయకులుగా పనిచేస్తున్న యం పద్మావతి పదవీ విరమణ సందర్భంగా నేడు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయము లోని ప్రధాన సమావేశ మందిరం నందు ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన సభలో ఉమ్మడి అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి వారి జీవితంలో పదవీ విరమణ అనివార్యమని, యం పద్మావతి వారి ఉద్యోగ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, జిల్లా పంచాయితీ రాజ్ శాఖలో ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. పదవీ విరమణ అనంతరం వారి శేష జీవితం ఆనందంగా, సుఖ సంతోషాలతో వారి కుటుంబ సభ్యులతో గడపాలని ఆకాంక్షించారు. అనంతరం పదవీ విరమణ గావించిన యం పద్మావతిని శాలువా, పూల మాలలతో సత్కరించి ఆత్మీయ సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ ఇంచార్జ్ సి ఇ ఓ ప్రభాకర్ రావు, ఉప ముఖ్య కార్యనిర్వహణ అధికారిణి  కె లలితా బాయి, కార్యాలయ పరిపాలనాధికారులు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.