పెద్దపప్పూరులో ఇంటింటికి పింఛన్ పంపిణీ

పెద్దపప్పూరులో  ఇంటింటికి పింఛన్ పంపిణీ

పెద్దపప్పూరు లో ఇంటింటికి పింఛన్ పంపిణీ 

 జన చైతన్య న్యూస్- పెద్దపప్పూరు 

అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెద్దపప్పూరు మండలం 01 జులై 2024 తేదీన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వికలాంగుల పెన్షన్ 3000 నుండి 6000కు పెంచినందుకు, వృద్ధులు వితంతువులు, ఒంటరి మహిళలు, డప్పు కళాకారులు, చర్మకారులు వివిధ పథకాల కింద పెన్షన్ లబ్ధిదారులకు 3000 నుండి 4000 కు మరియు ఏప్రిల్, మే, జూన్ మూడు నెలలది 3000 కలిపి 7000 రూపాయలు ఇచ్చినందుకు పెద్దపప్పూరు మండల కేంద్రంలో ఆర్డిటి కాలనీలో ఆర్డిటి స్కూల్ ఆవరణంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వికలాంగుల హక్కుల పోరాట సమితి వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెన్షన్లు పెంచినందుకు కృషిచేసిన వికలాంగుల ఆత్మబంధువు వృద్ధులు వితంతువుల పెద్ద కుమారుడు అయిన మహాజన నేత మాన్య మందా కృష్ణ మాదిగ అలాగే మానవతా దృక్పథంతో పెన్షన్లు పెంచిన ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు, అలాగే స్థానిక తాడపత్రి మున్సిపల్ చైర్ పర్సన్ జెసి ప్రభాకర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డి, చిత్రపటాలకు అనంతపురం జిల్లా ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి, జాతీయ నాయకులు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దపప్పూరు ఆదినారాయణ మాదిగ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు.

వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దపప్పూరు టీ ఆదినారాయణ మాదిగ మాట్లాడుతూ వికలాంగుల సంక్షేమం కోసం ఉద్యమం చేస్తున్న మాన్య మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో వికలాంగుల సమస్యలను ఉద్యమాల ద్వారా రాజకీయ పార్టీల దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మానవత్వంతో వికలాంగుల పెన్షన్ 6000 కి పెంచుతామని ఇచ్చిన హామీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు ఎమ్మార్పీఎస్, వీహెచ్పీఎస్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉదయమే సచివాలయం అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎమ్మార్పీఎస్ నాయకులు ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేస్తున్న కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, ఎం ఎస్పీ, జాతీయ నాయకులు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దపప్పూరు టీ ఆదినారాయణ మాదిగ తెలుగుదేశం పార్టీ నాయకులు, షేక్షావలి, బాల చితంబరి,తలారి, కృష్ణ, ఏ గంగన్న, ఎం నాగయ్య, నాగేష్, పులిగల నారాయణ, కే నాగరాజు, బి ఆదినారాయణ, లక్ష్మీదేవి, ఎట్టి చిన్న వీరన్న, ఏ నారాయణస్వామి రెడ్డి, కుల్లాయమ్మ తదితరులు పాల్గొన్నారు.