పాలకులకు చిత్తశుద్ధి ఉంటే నిత్యవసర సరుకులను నియంత్రించడం సాధ్యమే

పాలకులకు చిత్తశుద్ధి ఉంటే నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ సాధ్యమే ఎలా ?.ఇలా
విజయవాడ _ జనచైతన్య (తమ్మిన గంగాధర్)
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలకులకు చిత్తశుద్ది ఉంటే నిత్వాసర వస్తువుల ధరల నియంత్రణ సాధ్యమేనని మేధావి వర్గం అభిప్రాయ పడుతుంది. రోజురోజుకు నిత్యావసర వస్తువుల ధరలు నింగికెగుస్తూ వినియోగదారుల నడ్డి విరుస్తున్నాయి. దరిమిలా అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
ముఖ్యంగా బడుగు, బలహీన, మధ్యతరగతి ప్రజల పరిస్థితి మరింత ధారుణంగా ఉంది. అది ఇది అని కాకుండా అన్ని వస్తువు ధరలు పై పైకి ఎగబాకుతున్నాయి. కూరగాయల పరిస్తితి ఇందుకు భిన్నంగా లేదు. అన్ని తరహాల వంట నూనెలు, ధాన్యాలు ధరలు మూడు నుంచి నాలుగు రెట్లు పెరిగి సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి ఈ నేపథ్యాన్ని నిలువరించాల్సిన పాలకులు ఆదిశలో దృష్టి పెట్టక పోవడంతో ఈ దుస్తితి నెలకొంది. ప్రపంచ దేశాలలో ఎక్కడ కూడా ఈ పరిస్తితి లేదు. నేటి పాలక ప్రభుత్వాలు గద్దె నెక్కేంతవరకు ప్రజలను ఆశల పల్లకిలో విహరింప చేస్తాయి. అనంతరం
తమకు అధికారం కట్టబెట్టిన ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి ధనార్జనే లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరిస్తితి ఉంది.
నిజంగా నిత్యావసర వస్తున ధరల నియంత్రణ పట్ల పాలకులకు చిత్తశుద్ది ఉంటే అదుపు చేయవచ్చు. ఎలా అంటే ఇలా చేయొచ్చొని మేధావి వర్గం చెబుతుంది. మితిమీరిన నిత్యావసర వస్తువుల ధరల మితిమీరిన పెరుగుదలకు మధ్య దళారీ వ్యవస్త వికృత పోకడే ప్రధాన కారణమని పాలకులు గుర్తించాలి. ఈ దళారీ వ్యవస్థను పూర్తిగా కూకటి వేళ్ళతో సహా పెకిలించి వేసేందుకు ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరించాలి. అప్పుడే ధరల నియంత్రణకు మార్గం సుగమనం అవుతుంది. ఇందుకు ముందుగా నిత్యావసర వస్తువుల చిల్లర, ప్రవేటు విక్రయాలను పూర్తిగా రద్దు చేసి ప్రభుత్వమే ఉత్పత్తిదారుల నుండి నేరుగా కొనుగోలు చేయాలి. ముఖ్యంగా రైతులు పండించే అన్ని తరహాల ధాన్యాలను కూరగాయలతో పాటు నూనె గింజలు, యర్రగడ్డలు, తరలించాలి. అక్కడ నుండి మండల, గ్రామ స్థాయిలో ఏర్పాటు తెల్లగడ్డలను సైతం ప్రభుత్వం కొనుగోలు చేయాలి. అప్పుడే దలారీ వ్యవస్త తో పాటు నల్లబజార్ అడ్రస్ గల్లంతు అవుతుంది. ఈ నేపథ్యాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాట చేయాలి. అగ్రికల్చర్, సివిల్ సప్లెయిస్, ఎన్పోర్స్మెంట్ విభాగాలను సంధానం చేయాలి. సంబంధిత అధికారుల సంయుక్త పర్యవేక్షణలో కొనుగోలు, విక్రయాల క్రమాలను చేపట్టాలి. ఇందుకు అవసరమైన సిబ్బందిని నియమించాలి. ప్రతి మండల కేంద్రంలో రైతుల వద్ద నుండి కొనుగోలు చేసిన అన్ని వస్తువులను నిలువ చేసేందుకు అవసరమైన సాదా, సీత గిడ్డంగులను ప్రభుత్వమే నిర్మించాలి. అన్ని స్థాయిల్లో విక్రయశాలలను ఏర్పాటు చేయాలి. కొనుగోలు చేసిన వస్తువులను గిడ్డంగు లకు, అక్కడ నుండి విక్రయశాల లకు ఎప్పటికప్పుడు తరలించేందుకు ప్రతి మండలానికి 108 తరహాలో 2 లేక 3 వాహనాలను ఏర్పాటు చేయాలి. నిర్వాహణకు అవసరమైన ఉద్యోగులను కనీస వేతనాలతో నియమించాలి. ఇది కొంతమేరకు నిరుద్యోగాన్ని పారదోలుతుంది. సంబంధిత అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించి రోజువారిగా గ్రామ స్థాయిలో రైతులు పండించిన ఉత్పత్తులకు గిట్టుబాటు ధరను నిర్ణయించి కొనుగోలు చేయాలి. ఎప్పటికప్పుడు గిడ్డంగులకు చేసిన విక్రయశాలలకు అవసరం మేరకు తరలించాలి.
నిర్వాహన, రవాణా ఖర్చులు, ఉద్యోగుల జీత భత్యాలను దృష్టిలో ఉంచుకుని కనీస ధరలు నిర్ణయించి విక్రయ క్రమాన్ని చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలి. నిర్వాహణ సిబ్బంది రోజు వారిగా సాయంత్రాని కల్లా జమ ఖర్చులు నమోదు చేయాలి. నిలువు ఉన్న వస్తువుల పట్టికను కూడా రికార్డు చేసి పై అధికారులకు ఎప్పటికప్పుడు సమర్పించాలి. పొరపాట్లు జరితే సంబంధిత ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలి. ప్రవేటు విక్రయాలు లేకపోతే నల్లబజారు బెడద ఉండదు కాబట్టి కక్కుర్తి పడే అవకాశం ఉండదు. దీంతో రైతుకు గిట్టుబాటు ధర లభించడమే కాకుండా వినియోగదారునికి సరసమైన ధరలకు నిత్యావసర వస్తువులు లభించే అవకాశం మెండుగా ఉంది. ప్రభుత్వాలు ఈ విధంగా ఎలాంటి లాభాపేక్షలు లేకుండా పై క్రమాన్ని చిత్తశుద్ధితో నిర్వహిస్తే నిత్యావసర వస్తువుల ధరలను నింగి నుంచి నేలకు దించటం పెద్ద పనేమి కాదు. అంతే కాకుండా కొంతమేరకు నిరుద్యోగ సమస్య తగ్గుతుంది కూడా. ఇప్పటికైనా ఈ దిశలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలకులు వ్యవహరించి నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ పై దృష్టి పెట్టి అన్ని వర్గాల ప్రజల మన్ననలను పొందాలని ఆశిద్దాం.