షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్కు పూర్వం వైభవం

షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్కు పూర్వం వైభవం

షర్మిలమ్మ నాయకత్వం లో కాంగ్రెస్ కు పూర్వవైభవం ఖాయం

విజయవాడ _ జనచైతన్య (తమ్మిన గంగాధర్ )

కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశం లో డి వై దాసు

విజయవాడ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టిన వై ఎస్ షర్మిల నాయకత్వం లో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని పామర్రు మాజీ ఎమ్మెల్యే డి. వై దాసు అన్నారు. విజయవాడ బెంజి సర్కిల్ సమీపంలో శేష సాయి కళ్యాణ మండపంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డి. వై దాసు మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ పార్టీ కే సాధ్యం అన్నారు. దేశానికి కాంగ్రెస్ పార్టీ నే శ్రీరామ రక్ష అన్నారు. కేంద్రం లోను రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ని అధికారంలోకి తెచ్చేందుకు అందరం సైనికుల్లా పనిచేద్దాం అన్నారు.రాహుల్ గాంధీ ప్రధాని కావాలని , షర్మిలమ్మ ముఖ్యమంత్రి కావాలని ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల ఏకైక లక్ష్యం కావాలని డి వై దాసు ఆకాంక్షించారు.

చేరికలు. పామర్రు నియోజకవర్గం  నుంచి వైసిపి ,టిడిపి, జనసేన పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు డి.వై.దాస్  ఆధ్వర్యంలో షర్మిల నాయకత్వంలో శుక్రవారం విజయవాడలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.