కాపు రిజర్వేషన్ సమస్యలకు-రాజకీయ పరిష్కారమే
కాపు రిజర్వేషన్ల సమస్యకు అంతిమ పరిష్కారమార్గం రాజకీయ పరిష్కారం
విజయవాడ _జన చైతన్య (తమ్మిన గంగాధర్ )
బి.సి. వర్గాల వారి ప్రయోజనాలకు ఏవిధమైన ఇబ్బంది లేకుండానూ, అదే సందర్భంలో ఇతర ఓ.సి. వర్గాలవారు మరింత ప్రయోజనం పొందేవిధంగానూ, సమగ్ర కులగణన ద్వారా రాజ్యాంగబద్ధంగా బీహార్, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల మాదిరిగా కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల వారికి గౌరవ హైకోర్టు వారు సమర్ధించిన జి.ఓ.నెం.30 (1994వ సం॥)ను అనుసరించి ప్రత్యేక బి.సి. రిజర్వేషన్లను తిరిగి పునరుద్ధరించవచ్చు. ఈ రాజకీయ నిర్ణయం వల్ల రాజకీయంగా ఓటుబ్యాంకు పెరుగుతుంది గాని ఏమాత్రం తగ్గదు. కాపులతో పాటు మిగిలిన ఓ.సి.లు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తారు, ఈ నిర్ణయం తదుపరి కూడా ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్లను యధావిధిగా కొనసాగించడం వలన మిగిలిన ఓ.సి.లు లబ్ధి పొందుతారు. కావున వారంతా సమర్ధిస్తారు. ప్రస్తుతం ఉన్న బి.సి.లకు ఏవిధమైన ఇబ్బంది లేకుండా స్పెషల్ బి.సి. కేటగిరి క్రింద కాపుల జనాభాకు అనుగుణంగా వారు కోల్పోయిన రిజర్వేషన్లు తిరిగి పునరుద్ధరించడం అనేది పాలక, ప్రతిపక్షాల ధర్మం. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలలో ఉన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ వెనుకబాటుతనాన్ని పాలక, ప్రతిపక్ష, ఇతర రాజకీయ పక్షాలవారు గుర్తించాలి, స్పందించాలి. మాకు సామాజికన్యాయం చేయాలి. ప్రభుత్వ విద్యాసంస్థలలో మా సంఖ్యను, ప్రభుత్వ ఉద్యోగాలలో మా సంఖ్యను, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల నుండి పార్లమెంటు సభ్యుల వరకు, గల్లీ నుండి ఢిల్లీ వరకూ ఉన్న మా సామాజిక వర్గాల ప్రజా ప్రతినిధుల సంఖ్యను సమగ్ర కులగణన ద్వారా మా జనాభాతో సరిపోల్చి జనాభాకు అనుగుణంగా మాకు న్యాయం జరుగుతోందా. విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ అవకాశాలలో మాకు న్యాయం జరుగుతోందా. అనేది పాలక, ప్రతిపక్షాలు, ఇతర రాజకీయపక్షాలవారు పరిశీలించి, సత్వరమే స్పందించాలి. మాకు సామాజికన్యాయం చేయాలని డిమాండ్ చేయుచున్నాము. దశాబ్దాల కాలంనుండి మాకు జరుగుచున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ అన్యాయంపై పాలక, ప్రతిపక్షాలతో సహా అన్ని రాజకీయపక్షాలవారు సత్వరమే స్పందించాలని మేము డిమాండ్ చేయుచున్నాం. ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్లలో కాపులకు 5% సబ్‌కోటా అనే డిమాండ్‌ను మేము బాహాటంగా వ్యతిరేకిస్తున్నాం. కాపుల చిరకాల డిమాండ్ ప్రత్యేక బి.సి. రిజర్వేషన్ల పునరుద్ధరణ మాత్రమే. మేము కోల్పోయిన బి.సి. రిజర్వేషన్లను తిరిగి మాకు కల్పించాలన్నదే మా చిరకాల డిమాండ్. మా చిరకాల డిమాండ్‌ను టి.డి.పి. వక్రీకరించి ఏదో మసిపూసి మారేడుకాయ చేద్దామనే చందంగా వ్యవహరిస్తే మేమే న్యాయపోరాటం చేసి ఆ అసంబద్ధమైన జి.ఓ.లను న్యాయస్థానాలలో సైతం ఎదుర్కొంటాం. మా చిరకాల డిమాండ్ సాధనకోసం బి.సి.వర్గాలవారి, ఓ.సి. వర్గాలవారి సహకారాలను కూడా మేము తీసుకొని చట్టపరిధికి లోబడి పోరాటం చేస్తామని పాలక, ప్రతిపక్షాలతో సహాఅన్నిరాజకీయపక్షాలవారికీ ముందుగానే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దయచేసి మా డిమాండ్‌ను వక్రీకరించకుండా మా జనాభాప్రాతిపదికగా మాకు న్యాయంచేయాలని డిమాండ్ చేయుచున్నాం. ఎ.పి.లో గల పాలక, ప్రతిపక్షాలతో సహా అన్ని రాజకీయపక్షాలవారు కూడా కాపు రిజర్వేషన్ల సమస్యపై మీ మీ పార్టీల వైఖరులను బహిరంగంగా తెలియజేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేయుచున్నాము.సామాజికఉద్యమాభివందనములతోతమ విశ్వసనీయ,
తాడివాక రమేష్ నాయుడు,
జాతీయ అధ్యక్షులు, కాపునాడు, గిద్దా శ్రీనివాసనాయుడు,
రాష్ట్ర కన్వీనర్, కాపునాడు,
అమ్మా శ్రీనివాస నాయుడు,
రాష్ట్ర ఛైర్మన్, కాపు జె.ఎ.సి.
జె.టి. రామారావు,
రాష్ట్ర కన్వీనర్, కాపు జె.ఎ.సి.
రావి శ్రీనివాస్,
రాష్ట్ర ఛైర్మన్, కాపు ఐక్యవేదిక
పెద్దిరెడ్డి మహేష్,
రాష్ట్ర కన్వీనర్, కాపు ఐక్యవేదికస్థలం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా, కాపులకు సామాజికన్యాయం జరిగేంత వరకూదయచేసి షేర్ చేయండి, వైరల్ చేయండి.