నూతనంగా ఏర్పడినటువంటి రేషన్ స్టోర్ ప్రారంభించారు
నూతనంగా ఏర్పడినటువంటి రేషన్ స్టోర్ ప్రారంభించారు
జనచైతన్య న్యూస్- ఓబులదేవర చెరువు
సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం ఓబుల దేవర చెరువు మండలం ఆకుతోటపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పడినటువంటి రేషన్ స్టోర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి స్టోర్ డీలర్ కుమార్ రాయల్ అభినందించారు. ఏ ఒక్కరికి రేషన్ బియ్యం లో ఎలాంటి అవకతవకులు ఉండకూడదని వివరించి చెప్పారు, ప్రతినెల రేషన్ ఇస్తున్నవంటి సమయంలో ప్రతి ఒక్కరికి తగిన సమయం కేటాయించి అందుబాటులో ఉండేలా చూడమని చెప్పారు. ఈ కార్య క్రమంలో ధనుంజయ, నరసప్ప, శంకర్, నారాయణస్వామి, రమణయ్య, యుగంధర్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు, గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు, సొంత గ్రామానికి స్టోర్ రావడం అంటే చాలా సంతోషంగా ఉందని కొనియాడారు.