అనంతపురంలో భారీగా నగదు కంటైనర్లు పట్టివేత

అనంతపురంలో భారీగా నగదు కంటైనర్లు పట్టివేత

రెండువేల కోట్లు పట్టివేత 

నాలుగు కంటైనర్లలో తరలింపు

ఆర్బీఐ డబ్బు అట

విజయవాడ-జనచైతన్య (తమ్మిన గంగాధర్)

 అనంతపురం పోలీసులు సూపర్ గురూ..

అనంతపురం జిల్లా పామిడి సమీపంలో  భారీగా కరెన్సీ నోట్లను పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల తనిఖీలో నాలుగు కంటైనర్లలో 500 నోట్ల కట్టలు దర్శనమియ్యటంతో అధికారుల కళ్లు తిరిగాయి.  మొత్తం రూ.2వేల కోట్ల మేరకు డబ్బు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.  ఈ కంటైనర్లు ఆర్బీఐకి చెందినవిగా అక్కడి అధికారులు చెబుతున్నారు. కొచ్చి నుంచి హైదరాబాద్ కు  తరలిస్తున్నట్లు తెలిపారు. రికార్డులను పోలీసులు పరిశీలిస్తున్నారు.  నిజంగా ఆర్బీఐకి చెందిన నోట్ల కట్టలైతే. ఈ కంటైనర్లను వదిలేస్తారు. ఈ కంటైనర్లపై పోలీసు స్టిక్కర్లు ఉండటం విశేషం. ఎన్నికల వేళ చెక్ పోస్టుల్లో పోలీసులు మొహరించిన స్థితిలో..  పోలీసు శాఖ ఆధ్వర్యంలో.. పోలీసు బందోబస్తు లేకుండా ఆర్బీఐ ఎలా నోట్లు తరలిస్తుందో అర్థం కాని ప్రశ్న.  సాధారణంగా ఏటీఎంల్లో నోట్ల కట్టలు ఫిల్ చేయటానికి సొంత సెక్యూరిటీ సిబ్బందిని బ్యాంకులు పంపిస్తాయి. ఆర్బీఐ అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ డబ్బును తరలిస్తే.. పోలీసు శాఖకు తప్పనిసరిగా సమాచారం ఇస్తుంది. దారిలో దోపిడీ దొంగల దాడిని నిరోధించే రీతిలో పక్కా ప్లాన్ తో నోట్ల తరలింపు ఉంటుంది. ఒక రాష్ట్రం నుంచి మరోక రాష్ట్రానికి నోట్లు తరలించే సమయంలో పోలీసులకు తప్పని సరిగా సమాచారం ఉంది. ఈ సమాచారం గోప్యంగా ఉంటుంది. ఈ వాహనాల భ్రదత, రక్షణకు పైలట్ వెహికల్ తప్పని సరి. మరి ఈ నాలుగు కంటైనర్లను అత్యంత రహస్యంగా ఆర్బీఐ తరలించటం ఎంతవరకూ నిజమో.. చూద్దాం. ఏపీ పోలీసుల పనితీరును గుర్తిద్దాం. ఎందుకంటే తమ  కళ్లముందే తరలుతున్న 2000 కోట్ల నగదును గుర్తించిన పోలీసులను ప్రశంసిద్దాం.