సామాన్యుని నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా యదల్ల రాజేష్ కుమార్*
*సామాన్యుని నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా యదల్ల రాజేష్ కుమార్*
*రైతుకి ఓటు వేద్దాం... భవితకు బాట వేద్దాం*
*చెరకు రైతు గుర్తుకే మన ఓటు...*
కదిరి నియోజకవర్గం ఎన్ పి కుంట మండలం మారుమూల ప్రాంతం తాటి మానుగుంత గ్రామం లో పేద కుటుంబంలో జన్మించిన యదల రాజేష్ అసెంబ్లీ ఎన్నికల్లో కదిరి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. ఇతను పట్రా కులానికి చెందిన వ్యక్తి కదిరి నియోజవర్గ పరిధిలో మైనారిటీల తర్వాత అత్యధికంగా పట్రకులస్తులు ఉన్నారు వీరిలో ఇంతవరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ ఇంతవరకు ఎవరు వేయలేదు మొట్టమొదటిగా వేసిన వ్యక్తి కావడంతో కులస్తులు స్వతంత్రంగా వచ్చి ఇతని గెలుపు కోసం కృషి చేస్తున్నారు ఇతను పదవ తరగతి వరకు తిమ్మమ్మమర్రిమాను ప్రభుత్వ పాఠశాల హాస్టల్ లో చదివి ఇంటర్మీడియట్ ప్రభుత్వ జూనియర్ బాలుర కళాశాలలో 2012 లో ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘంలో చేరి 2018 వరకు విద్యార్థి సమస్యల పైన అనేక పోరాటాలు ప్రభుత్వ హాస్టల్ సమస్యల పైన జూనియర్ కళాశాల సమస్యల పైన స్కాలర్షిప్లు ఫీజుల పైన బస్సు సమస్యల పైన చాలా సమస్యల పైన పోరాటాలు చేసి 2018లో విద్యార్థి సంఘం తర్వాత ఎంపీ కుంట సోలార్ సెక్యూరిటీ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులుగా ఎన్నుకొని అతి తక్కువ రోజుల్లోనే సిపిఐ మండల కార్యదర్శిగా ఎన్నుకోవడం ఎన్. పి కుంట మండలంలోని ప్రతి ఒక్క గ్రామానికి వెళ్లి సమస్యల పైన అధికారులు దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించడంలో చాలా కృషి చేశారు ముఖ్యంగా రైతులు బ్యాంకుల్లో ఎదుర్కొంటున్న ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్, రోడ్డు, సోలార్ కార్మికులు, నీటి తదితర సమస్యల పైన కేవలం ఉద్యమాలే కాకుండా అతని టీమ్ తో సమాజ సేవ చేయడంలో కూడా ముందుంటారు అత్యవసర పరిస్థితులలో వందల మందికి రక్తదానం చేయించి, భారి వర్షాల సమయంలో కదిరిలో ఏక్కడికి అక్కడ అన్నదానాలు చేయించడం, చాలా సార్లు రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తులను ఆసుపత్రిలో చేర్పించడం అదేవిధంగా కరోనా సమయంలో దేశవ్యాప్తంగా సేవ చేస్తున్న సోనుసూద్ గారికి మద్దతుగా తాటిమానుగుంత గ్రామంలో ఇంటింటికి తిరిగి తమ వంతుగా సోనుసూద్ గారికి సహాయం చేయాలని దాదాపుగా 12 వేల రూపాయలు ఎన్.పీ కుంట ఎస్సై నరసింహుడు వారి చేతుల మీదుగా సోను సూద్ చారిటబుల్ ట్రస్ట్ కి ఆన్లైన్ ద్వారా పంపడం అదేవిధంగా కరోనా సమయంలో తమ గ్రామం కరోనా నుంచి కాపాడుకోవాలని ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకొని కరోనా నిబంధనలు తప్పకుండా ప్రతి ఒక్కరు పాటించేలా కృషి చేయడంతో కరోనా రహిత గ్రామంగా జిల్లాస్థాయిలో మంచి గుర్తింపు రావడం జరిగింది సిపిఐ నియోజవర్గ మహాసభలలో కదిరి డివిజన్ సహాయ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం తో మరింత ఆసక్తిగా ప్రజా సమస్యలపై ప్రజా వ్యతిరేక పాలనపై అనేక రకాలుగా నిరసనలు ధర్నాలు రాస్తారోకోలు దిష్టిబొమ్మ దహనాలు చేసి నియోజకవర్గంలో మంచి గుర్తింపు తెచ్చుకొని ముఖ్యంగా కదిరి రాయచోటి రోడ్డు సమస్య పైన చాలా రకాలుగా వినతిపత్రాలు ధర్నాలు రాస్తారోకోలు నిరాహార దీక్షలు చేసి చివరి వరకు కూడా ప్రజా సమస్యల పైన పోరాటాలు చేస్తూనే వచ్చారు ఈ నియోజకవర్గానికి ఎంతోమంది శాసనసభ్యులుగా ఎన్నుకోబడుతున్నారు తప్ప కదిరి నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడపడంలో విఫలమయ్యారు అని సామాన్యుడు నాయకుడుగా అసెంబ్లీలో అడుగుపెడితే అతను కి జనంలో తిరిగిన వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్క సమస్య ఎదుర్కొన్న వ్యక్తి కాబట్టి ఆ సమస్యలు పరిష్కారం కావాలంటే చట్టసభల్లోకి కేవలం డబ్బున్న వ్యక్తులు మాత్రమే కాకుండా సామాన్యుడు వెళితేనే ప్రజా పాలన బాగుపడుతుందని ఈరోజు కదిరి అసెంబ్లీ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుందని ప్రజా సమస్యల పైన అసెంబ్లీలో పార్టీలకు గొంతుగా కాకుండా ప్రజా గొంతుగా అడుగుపెట్టి ప్రభుత్వాలను నిలదీసి తమ సమస్యలను పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్ని వర్గాల నుంచి ఆదరిస్తున్నారని స్వచ్చందంగా రైతులు, యువకులు, విద్యార్థుల, కార్మికులు,నడుగుబలహీన వర్గాలు మైనార్టీల నుండి మంచి స్పందన వస్తోంది కదిరి నియోజకవర్గం లోని ప్రతి ఒక్కరూ నన్ను ఆశీర్వదించి మద్దతు తెలిపి ఈ వి ఎం నెంబర్ 13 చెరుకు రైతు గుర్తు పై ఓటు వేసి వేపించి అసెంబ్లీకి పంపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు.