శ్రీ భవాని హాస్పిటల్ ఉచిత యురాలజీ వైద్య శిబిరం

శ్రీ భవాని హాస్పిటల్ ఉచిత యురాలజీ వైద్య శిబిరం

శ్రీ భవాని హాస్పిటల్ ఉచిత యురాలజీ వైద్య శిబిరం

 విజయవాడ - జన చైతన్య న్యూస్ ప్రతినిధి (టి.జి )

కార్పోరేట్ వైధ్య సేవలు అందరికి అందుబాటులోకి తీసుకురావలనే ఆశయానికి అణుగుణంగా శ్రీ భవాని హాస్పిటల్లో ఈ నెల 21 తేదీ నుంచి 25వ తేదీ వరకు యురాలజీ వైధ్య సేవలను ఉచితంగా నిర్వహిస్తున్నామని, శ్రీభవాని మల్టి స్పెషాలిటీ హస్పటల్ ఛీఫ్ ఆడ్మీనిస్ట్రేటర్ డాక్టర్ దిలీప్ తెలిపారు.15 తేది నుండి నిర్వహిస్తున్న ఉచిత డయాబెటిక్ వైద్య శిబిరానికి విశేష స్పందన లభిస్తోందని శ్రీ భవాని హాస్పిటల్ కి చెందిన ఆయన తెలియజేశారు. శనివారం సాయంత్రం భవానీపురంలోని శ్రీ భవాని హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు వైద్యులు మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరంలో తాము చేస్తున్న పరీక్షల్లో పలువురు పేషెంట్లకు వివిధ రకాల వ్యాధులు ఉన్నట్లు కూడా గమనించడం జరిగిందన్నారు. దీనిపై వారికి సంబంధిత వైద్య నిపుణులు చేత వైద్య సలహాలు ఇప్పించడం జరిగిందని వారు చెప్పారు. శ్రీ భవాని హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వెనిగళ్ళ చంద్రశేఖర్ సారథ్యంలో నిర్వహిస్తున్న, ఈ ఉచిత వైద్య శిబిరం లో ప్రతి ఒక్కరికి 2000 రూపాయల విలువైన ఉచిత రక్త పరీక్షలు, ఎక్స్ రే తదితర పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వారు వివరించారు. శ్రీ భవాని హాస్పిటల్లో అన్ని రకాల వైద్య సేవలు అందజేస్తున్నామని, అన్ని అడ్వాన్సుడ్ సర్జరీలు అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు. భవానిపురం ప్రాంతంలో కేత్ లాబ్, డయాలసిస్ సౌకర్యం కలిగిన ఏకైక హాస్పిటల్ తమదేనని చెప్పారు. ఇప్పటికే అందిస్తున్న వైద్య సేవలతో పాటుగా యూరాలజీ, పర్మనాలజీ, డయాబెటాలజీ కు సంబంధించిన ఫుల్ టైం వైద్య సేవలను కూడా ప్రారంభించినట్లు వివరించారు. ప్రతి మంగళవారం, శుక్రవారం ఉచిత ఓపిని డయాబెటిక్ పేషెంట్లకు అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ అభిషేక్, డాక్టర్ అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.