అక్రమంగా ఇసుక రవాణా పట్టించుకోని అధికారులు

అక్రమంగా ఇసుక రవాణా పట్టించుకోని అధికారులు

అక్రమంగా ఇసుక రవాణా పట్టించుకోని అధికారులు 

 జనచైతన్య న్యూస్- తనకల్లు

సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనకల్లు మండలంలో అక్రమంగా పట్టపగలు టాక్టర్లతో ఇసుక రవాణా చేస్తున్నారు. అడ్డుకునే వారు లేరని చాలామంది డ్రైవర్లు ఇసుక తరలించడం జరుగుతుంది, పట్టించుకోరని ఎడా పేడ ఇసుక తవ్వేస్తున్నారు. సదుం బాలసముద్రం సి జి ప్రాజెక్ట్ నుంచి ఇసుక మాఫి భారీ స్థాయిలో అక్రమ రవాణా చేస్తుంది, జిల్లా స్థాయిలో నుంచి మండల స్థాయి వరకు అధికారులు తరచూ తనిఖీలు నిర్వహిస్తూ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పటిష్టమైన ఏర్పాటు చేశామని ప్రకటనలు గుప్పిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది, అధికారులు పట్టించుకోవడం లేదని, విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒక ట్రాక్టర్ కు 2000 నుంచి 2500 వరకు విక్రయిస్తున్నారు, టాక్టర్లు రాకపోకలతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.