అంబేద్కర్ విదేశీ విద్య పేరు కొనసాగింపు పై హర్షం వ్యక్తం చేసిన అంబేద్కర్ యువసేన యూత్
...అంబేద్కర్ విదేశి పేరు కొనసాగింపు పై హర్షం వ్యక్తం చేసిన అంబేద్కర్ యువసేన యూత్...
(పుట్లూరు జనచైతన్య న్యూస్)
అంబేద్కర్ విదేశీ విద్యకు పేరును కొనసాగించి నందుకు చంద్రబాబు ప్రభుత్వానికి అంబేద్కర్ యువసేన యూత్ గురువారం కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా అంబేద్కర్ యువసేన యూత్ అధ్యక్షుడు వి. రవి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఎస్సీ ,ఎస్టీ గా ఉన్న పేద విద్యార్థులకు ఉన్నతమైన చదువు కోసం గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన అంబేద్కర్ విదేశి విద్య కు గత మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన పేరు పెట్టుకోవడంపై సిగ్గుచేటని పుట్లూరు అంబేద్కర్ యువసేన యూత్ వి. రవి 'జన చైతన్య న్యూస్' తో తెలిపారు. అదేవిధంగా ఇటీవల ఏపీలో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరిగి ఆ పథకానికి రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు కొనసాగించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.