30 లక్షలు అడ్వాన్స్ తీసుకొని మోసం చేసిన న్యాయవాది రామస్వామి నాయుడు... మోసపోయిన వారిపై కేసులు నమోదు చేస్తూ బెదిరింపులు
(జన చైతన్య న్యూస్, కదిరి) : ఒక ప్రజా న్యాయవాది రామస్వామి నాయుడు మధ్యతరగతి కుటుంబాలకు మోసం చేయడం తప్పు కాదా కదిరి పట్టణంలో సైదాపురం పొలంలో సర్వేనెంబర్ 2 45-1 బి 1. ఆరెగరాల 46 సెంట్లు పైకి రెండు ఎకరాల 87 సెంట్లు వ్యవసాయ భూమి నాది అని 2019 సంవత్సరంలో తలుపులగంగాధర్. జయ రాములు ఇద్దరికీ ఒక్క కోటి 15 లక్షలకు బేరం చేసి అందులో 20 లక్షల రూపాయలు నగదు 10 లక్షల రూపాయలు గ్రామీణ బ్యాంక్ చెక్కు ద్వారా తీసుకోవడం జరిగింది. ఆ భూమి మీద కొన్నవారు వెళితే అక్కడ ఆ భూమి వేరే వాళ్లదని తెలుసుకున్న తర్వాత ఇది తప్పు మా డబ్బులు మాకు ఇచ్చేయండి అని అతని ఇంటి దగ్గరికి అనేకసార్లు వెళ్లి అడిగాము అయినప్పటికీ ఆయన రామస్వామి నాయుడు రేపు మాపు అని స్పందించకపోవడం వల్ల వారిని మధ్యతరగతి కుటుంబాలను బెదిరిస్తూ అనేకసార్లు మంచోలను పెట్టి బెదిరించడం జరిగింది. భయభ్రాంతులకు కూడా గురిచేయడం జరిగింది. అయితే ఈ భూమి నిన్నటి రోజున సాయంత్రం డబ్బులు అడిగినందుకు రామస్వామి నాయుడు మరో న్యాయవాదిని పెద్దమనిషిగావరప్రసాద్ గారిని ఇంటికి రమ్మని మా పైనే దౌర్జన్యం చేసి మా పైనే పోలీస్ స్టేషన్కు వెళ్లి కేసు పెట్టడం జరిగింది నాకు చట్టం విలువ తెలుసు మిమ్మల్ని ఏమైనా చేస్తానని బెదిరిస్తూ కేసు పెట్టడం జరిగింది. అయితే ఒక ప్రజా న్యాయవాదిగా మధ్యతరగతి కుటుంబాలకు డబ్బులు ఎగరగొట్టడానికి ఇలాంటి నీచమైన పనులు చేస్తారా ప్రతి ఒక్కరు ఇలాంటి రామస్వామి నాయుడు వారిపై ఖండించాలని ఖండిస్తారని తెలియజేస్తున్నాము.