అర్చకులపై జరిగే దాడులను వెంటనే అరికట్టాలి

అర్చకులపై జరిగే దాడులను వెంటనే అరికట్టాలి

అర్చకుల పై జరిగే దాడులను వెంటనే అరికట్టాలి.(పుట్లూరు జన చైతన్య న్యూస్) కాకినాడులో అర్చకులు పై దాడిని పుట్లూరు బిజెపి మండల అధ్యక్షుడు రాగేని రామంజి యాదవ్ తీవ్రంగా ఖండించారు.అనంతరం రామంజి యాదవ్ మాట్లాడుతూ దేవాలయాల లో పూజలు యజ్ఞాలు యాగాలు అర్చకులు పాత్ర చాలా కీలకమైనదని అన్నారు.భక్తులు అనేక సమస్యలు తొలగిపోవాలని దేవాలయంలో అర్చకులతో పూజలు నిర్వహిస్తు ఉంటారని చెప్పుకొచ్చారు.అంతేకాకుండా పూజలు సరిగ్గా చేయడంలేదని ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని అన్నారు.ఈ అర్చకులు భగవంత స్వరూపులుగా భక్తులు నమ్ముతారని అర్చకులను  తన పాదాలను చేతులు జోడించి  నమస్కారం చేస్తున్నటు వంటి వారే సాంప్రదాయం ప్రకారం హిందువులదని భక్తులదని తెలిపారు .కానీ ఇది కేవలం హిందూ మనోభావాలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తూ గాయపరచడమే అవుతుందన్నారు .ఇలా దాడి చేయడం అనేది పుట్లూరు బిజెపి మండల శాఖ తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం నుంచి వెంటనే  అధికారులకు నిఘా ఏర్పాటు చేయాలని బీజేపీ మండల అధ్యక్షుడు రాగేని రామాంజి యాదవ్ కోరారు.