ముస్లిం సోదరులకు పవిత్రమైన పండుగ రంజాన్..*

ముస్లిం సోదరులకు పవిత్రమైన పండుగ రంజాన్..*

*ముస్లిం సోదరులకు పవిత్రమైన పండుగ రంజాన్..*

*రంజాన్ పండుగ క్రమశిక్షణను,దాతృత్వాన్ని,ధార్మిక చింతనను ప్రజలకు భోదిస్తుంది..*

*హాజీ  బేపారి  బషీర్ ఖాన్ అదేసానుసారం రాయచోటి పట్టణం లో  వారి నివాసం వద్ద ,జీనత్ మస్జిద్ ,కోనేటి గడ్డ ,ప్రభుత్వ(వందపడకల) ఆసుపత్రి సుమారు వెయ్యికి మందికి పైగా కుల మతాలకతితంగా బట్టలు పంపిణి...*

*ప్రతి ఒక్కరు సంతోషంగా రంజాన్ పండుగను జరుపుకోవాలన్నదే తమ ఆశయం...*

*అన్నమయ్య జిల్లా వైసిపి విభాగం మైనార్టీ జిల్లా అధ్యక్షులు బేపారి మహ్మద్ ఖాన్...*

రంజాన్ పండుగ క్రమశిక్షణను,దాతృత్వాన్ని,ధార్మిక చింతనను ప్రజలకు భోదిస్తుందని అటువంటి పండుగను ప్రతి ఒక్కరు సంతోషంగా జరుపుకోవాలన్న ఆశయంతో   ప్రతీ ఏడాది తమ తండ్రి హాజీ బేపారి  బషీర్ ఖాన్ అదేసాను సారం కుల మతలాకతితంగా 1000  మందికి పైగా బట్టలు పంపిణి చేసినట్లు అయన కుమారుడు ,అన్నమయ్య జిల్లా వైకాప విభాగం మైనార్టీ అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్ తెలియజేశారు.ముందుగా తమ నివాసం వద్ద అయన కుమారుడు,కుమార్తె చేతుల మీదగా పంపణి చేశారు.అనంతరం జీనత్ మస్జిద్ తో పాటు ఈద్ఘా సమీపంలో కోనేటి గడ్డ ,ప్రభుత్వ ఆసుపత్రి లో పని చేస్తున్న సానిటేషన్,ఇతర సిబ్బందికి పంపిణి చేశారు .మగవారికి ఆడవారికి కావాల్సిన బట్టలను వారు పంపిణి చేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతు మా కుటుంబం రంజాన్ పండుగను పురస్కరించుకొని ప్రతీ ఏడాది కుడా పండుగా లాగా బట్టలు పంపిణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు .మేము సంపాదించే దాంట్లో  పేదలకు సేవ చేయడంలో మాకు ఎంతో సంతృప్తి కలుగుతుందన్నారు.ఎంతో మంది పేదలు ఆర్ధికంగా ఇబ్బందులు పడే వారికీ తమ వంతు గా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. రంజాన్ నెలలో (జకాత్ )దాన ధర్మాలు చేయాలనీ ఖురాన్ చెబుతుందన్నారు.మనం సంపాదించిన దాంట్లో కొంత పేదలకు దానం చేయాలన్నది జకాత్ నిర్వచనం అన్నారు . తమ కుటుంబ సభ్యులు ఆనందంగా పండుగను జరుపుకునేందుకు బట్టలు పంపిణి చేసిన వారి కి వారి కుటుంబ సభ్యులకు ఆ అల్లా ఆస్సిసులు ఎల్లా వేళలా కలగాలని భవిష్యత్తులో ఎటువంటి సేవా కార్యక్రమాలు కొనసాగించేలా ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలు  ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకొంటున్నామన్నారు .ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సిపి రాయచోటి యువజన విభాగం జనరల్ సెక్రెటరీ బేపారి జబిబుల్లా ఖాన్,అర్షద్ ఖాన్ ,కైజర్ ,తదితర మైనార్టీ నేతలు పాల్గొన్నారు...