కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ పక్షాన మొదటి నామినేషన్ సెట్ దాఖలు

కాంగ్రెస్  ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ పక్షాన మొదటి నామినేషన్ సెట్ దాఖలు

కాంగ్రెస్  ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ పక్షాన మొదటి నామినేషన్ సెట్ దాఖలు మెదక్ ఎన్నికల అధికారికి నామినేషన్ సెట్

(పటాన్చెరు కాన్సెన్స్ ప్రతినిధి జన చైతన్య న్యూస్)

మొదట మెదక్ పట్టణంలోని దత్తాత్రేయుని దేవాలయంలో పూజల అనంతరం

మెదక్ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేసిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, నర్సాపూర్ ఇంచార్జ్ రాజిరెడ్డి,మెదక్ డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్,మెదక్ మునిసిపల్ చైర్మన్ చంద్రపాల్

మెదక్ పార్లమెంట్  కాంగ్రెస్  ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్   పక్షాన మొదటి సెట్ నామినేషన్ పత్రాలను ఆయన తరుపున మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ అధ్వర్యంలో ఎన్నికల అధికారి రాహూల్ రాజ్  కు అందచేసారు. ఈ మేరకు మైనంపల్లి రోహిత్ నర్సాపూర్ కాంగ్రెస్ ఇంచార్జి ఆవుల రాజి రెడ్డి, మెదక్ డిసిసి అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ ,మెదక్ మున్సిపల్ ఛైర్మెన్ చంద్ర పాల్ తో  కలిసి మెదక్ కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి రాహూల్ రాజ్ కు పత్రాలు అందజేసి నామినేషన్ దాఖలు ప్రక్రియను పూర్తి చేశారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్యులు,  నాయకులు,  కార్యకర్తలు పాల్గొన్నారు.