బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

పటాన్ చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం

బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

పటాన్చెరు కాంసెన్సీ ప్రతినిధి ఈ, భాస్కర్ జన చైతన్య  న్యూస్

కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి  ఆహ్వానించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు, అసెంబ్లీ కోఆర్డినేటర్ శ్యామ్ గౌడ్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ని భారీ మెజారిటీతో గెలిపించాలి : కాట శ్రీనివాస్ గౌడ్

మెదక్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్  ఆధ్వర్యంలో పాటి X-రోడ్ ఎస్.వి.ఆర్ గార్డెన్ లో నిర్వహించిన పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి , మాజీ శాసనసభ్యుడు మైనంపల్లి హనుమంతరావు , ఎంపీ అభ్యర్థి నీలం మధు, పటాన్ చెరు అసెంబ్లీ కోఆర్డినేటర్ బండి శ్యామ్ గౌడ్ హాజరయ్యారు. కార్యక్రమంలో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేసిన విధంగానే జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు అందరూ కూడా పనిచేసి మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ని భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోచారం సర్పంచ్ జగన్, బొల్లారం కౌన్సిలర్ సునీత మహేందర్, ముత్తంగి గ్రామ గౌతం, వెలిమెల గ్రామ సత్యనారాయణ వారి బృందాలతో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు  సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు.