స్థానిక 60 డివిజన్లలో హైమాస్ లైట్లు ప్రారంభం
విజయవాడ -జన చైతన్య (తమ్మిన గంగాధర్ ):- విజయవాడ 60 వ డివిజన్ వాంబే కాలనీ జి బ్లాక్ సెంటర్ వద్ద రూ.1.07 కోట్ల వ్యయంతో నిర్మించిన వైఎస్సార్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను రాష్ట్ర హోమ్ శాఖామాత్యులు తానేటి వనిత, రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి, డీఎంఓహెచ్ సుహాసిని, వైసీపీ కార్పొరేటర్లు, డివిజన్ ఇంచార్జిలు, కోఆర్డినేటర్లు, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం యు పి హెచ్ సి వద్ద రూ. 3.50 లక్షలతో హైమాస్ట్ లైట్లను ప్రారంభించారు.