పరిహారంలోనూ పరిహాసం ఆడుతున్న _ప్రభుత్వం

పరిహారంలోనూ పరిహాసం ఆడుతున్న _ప్రభుత్వం
పరిహారంలోనూ పరిహాసం ఆడుతున్న _ప్రభుత్వం

నమోదుకు నిరాకరిస్తున్న అధికారులు దిక్కు తోచని స్థితిలో పనలు తడిచిన రైతులు -మోపిదేవి తుఫాను ప్రభావంతో కురిసిన అధిక వర్షాల కారణంగా కోతలు కోసి, పనలు తడిచి ,మొలకలు వచ్చిన పంటకు పరిహారం అందించడంలోనూ ప్రభుత్వం మొండి చేయి చూపి రైతులను అపహాస్యం పాలు చేస్తుంది.అధిక వర్షాలకు ముందు కోతలు కోసిన పంటకు ప్రభుత్వం అందించే పరిహారానికి నమోదు చేయవద్దు అంటూ ప్రభుత్వ ఆదేశాలు జారీ చేయడంతో క్షేత్రస్థాయిలో వర్షాలకు తడిసిన పనలను ప్రభుత్వ అధికారులు నమోదు చేయడం లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వరి కోత కోయకుండా ఉన్న పొలాలు మాత్రమే పరిహారం అందించేందుకు నమోదు చేస్తున్నారు . పంటను పరిహారం పంపిణీకి నమోదు చేయవద్దు అని ప్రభుత్వం స్పష్టంగా ఆదేశాలు జారీ చేసినట్లు క్షేత్రస్థాయి సిబ్బంది చెబుతూ ఉండటంతో దిక్కు ఎవరూ అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వర్షాలకు ముందు కోతలు కోసిన రైతులు పనుల పై ఉన్న పంట మొక్కలు మొలకలు రావడాన్ని చూచి కన్నీటి పర్యంతం అవుతున్నారు. అంతంత మాత్రమే అందించే ప్రభుత్వ సహాయానికి కూడా మేము నోచుకోలేదా...అంటూ రైతు లు తన ఆవేదన చెప్పుకునేందుకు కూడా ఏ ఒక్కరు కనిపించడం లేదు అంటున్నారు. దేశానికి రైతే వెన్నుముక అని పురాణాలు... పెద్దలు చెప్పిన మాటలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి అంటూ రైతు మొలకలు వచ్చిన పంటను చూసి పంటపై పెట్టిన పెట్టుబడికి కనీసం వడ్డీలు అయినా ఎలా చెల్లించాలి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . రాజకీయ పార్టీలకు కేవలం ఓట్లు వేసే ఓటర్లు గానే కనిపిస్తున్నాము కానీ వేలాది రూపాయలు పెట్టుబడిగా పెట్టి రక్తాన్ని అమ్ముకొని మరి సాగు చేసిన పంటకు ప్రకృతి వైపరీత్యాల సమయంలో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి అన్న ఉద్దేశం కూడా ఏ ఒక్క రాజకీయ పార్టీకి లేకపోవడందురదృష్టకరమంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . వర్షాలకు ముందు కోసిన వరి పంటలు బొబ్బర్లంక, శివరామపురం, పెదకళ్ళపల్లి వెంకటాపురం గ్రామాలలో మొలకలు వచ్చినప్పటికీ అధికారులు మాత్రం నష్టపరిహారానికి కూడా పనికిరాదు అని తెగేసి చెబుతుంటే మరింత బాధ కలిగిస్తుందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరా లోచన చేసి పంటలు దెబ్బతిని, మొలకలు వచ్చిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలుచేసి, వర్షాలకు ముందు కోసిన పంటను నమోదు చేసి నష్టపరిహారం అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.