టీడీపీ వైసీపీ నుంచీ బీసీవై పార్టీ లోకి వలసలు పర్వం

జన చైతన్య న్యూస్ అనంతపురం జిల్లా, యాడికి మండలం వీరన్న పల్లి గ్రామంలో, బోడె రామచంద్ర యాదవ్ స్థాపించిన (బీసీవై) భారత చైతన్య యువజన పార్టీ. తాడిపత్రి ఇంచార్జ్ డాకరాజు యాదవ్ ఆధ్వర్యంలో వీరన్న పల్లి గ్రామంలో, నిన్నటి రోజు 30 కుటుంబాలు వైసిపి నుంచి, 30 కుటుంబాలు టిడిపి నుంచి బీసీవై పార్టీలోకి కండువా కప్పి ఆహ్వానించడం జరిగింది. తాడిపత్రి ఇంఛార్జి దాక రాజు యాదవ్ మాట్లాడుతూ బీసీవై పార్టీ ప్రజలకు మంచి చేయాలని ఉద్దేశంతో స్థాపించడం జరిగింది ఎల్లప్పుడూ ప్రజలకు తోడుగా ఉంటామని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో, బీసీవై పార్టీ నాయకులు, కంబగిరి రాముడు, సాయి, బాలయ్య, గంగాధర్, చిన్న పుల్లయ్య మరియు కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.