పుణ్యక్షేత్రాలలో ప్రసిద్ధ నవ నార ప్రహ్లాద సమేత "శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి

పుణ్యక్షేత్రాలలో ప్రసిద్ధ నవ నార ప్రహ్లాద సమేత "శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి

ప్రసిద్ధ నవ నారసింహ స్వామి పుణ్య క్షేత్రాలలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ప్రహ్లాద సమేత "శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి" వారి క్షేత్రం.

శ్రీ వారికి ప్రతిఏటా ఫాల్గుణ మాసంలో 15 రోజుల పాటు అత్యంత వైభవంగా శ్రీ వారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.ఈ బ్రహ్మోత్సవాల వైభవాన్ని శ్రీ వారి భక్తులకు మరింత చేరువ చెయ్యడం కోసం ప్రతిఏటా రచయిత తమ వంతుగా చిన్నారావు గారు ,గాయకులు శ్రీ పూర్ణ చంద్ర ( హైదరాబాద్ ), కార్తికేయ డిజిటల్స్ కార్తిక్ , చక్రి ల సహకారంతో నేడు "శ్రీ స్వామి వారికి నీరాజనం" పేరుతో ఒక పాటను నేడు శ్రీ మధ్ ఖాద్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయంలో ఆలయ E.O శ్రీ వెండి దండి శ్రీనివాసుల రెడ్డి గారి , ఆలయ ప్రధాన అర్చకులు నరసింహ వసంతా చార్యుల చేతుల మీదుగా ప్రారంభించిన అనంతరం "స్వామి వారి నీరాజనం" కరపత్రాలను విడుదల చేశారు.

ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ "శ్రీ వారిపై భక్తి తో నిత్యం స్వామి వారికి సేవ చేయాలనే తపనతో కుటాగుల్ల వస్త్యవ్యులు చిన్నా రావు గారు ప్రతి ఏటా స్వామి వారికి సంబందించిన విశేషాలను రచిస్తూ రచనకు తగ్గతుగా కార్తిక్ ,చక్రి వీడియో రూప కల్పన చేస్తున్నారని వీరికి ఆ శ్రీ వారి ఆశీస్సులు కలగాలని ఆశీర్వచనం చేశారు."

రచయిత చిన్నా రావు గారిని ఆలయ E.O శ్రీ వారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ,ప్రసాదాన్ని అందించారు.

ఈ కార్యక్రమంలో లక్ష్మణ కుటాల, రేవూరి కళ్యాణ్ , హరి ప్రసాద్ , రాజేంద్ర , చంద్ర శేఖర్,సాయి కుమార్,పురుషోత్తం,మధు సుధన్,నాగమల్లు అన్న , లాయర్ లోకేశ్వర్ రెడ్డి సుబ్బ రాయుడు అన్న , మోరుపురి ప్రసాద్ అన్న, నచ్చు బాలకృష్ణ ,శంతన్ మరియు కార్తికేయ డిజిటల్ టీమ్ సభ్యులు పాల్గొన్నారు.