పటాన్చెరు: ఇంటి నిర్మాణానికి ఎండిఆర్ ఫౌండేషన్ చేయూత
ఇంటి నిర్మాణానికి ఎండిఆర్ ఫౌండేషన్ చేయూత
(జన చైతన్య న్యూస్ )
పటాన్చెరు ప్రతినిధి డిసెంబర్ 19
ఇంటి నిర్మాణం మొదలు పెట్టి డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న ఒక కుటుంబానికి MDR ఫౌండేషన్ అండగా నిలిచింది. ఇంటి నిర్మాణం పూర్తి చేసుకునేలా తమ వంతుగా దేవేందర్ రాజు గారు 10,000/- ఆర్థిక సాయం అందించారు. పటాన్ చెరు బస్ స్టాండ్ వద్ద చెరుకు బండి నడుపుతూ జీవించే కొటేశ్వరి కుటుంబానికి "ఉండటానికి ఒక చిన్న ఇల్లు కట్టుకుందామని పని మొదలు పెట్టినం. ఆర్థిక ఇబ్బందుల కారణంగా మధ్యలోనే పని ఆగిపోయింది. మా బాధ తెలుసుకున్న ఎండీఆర్ ఫౌండేషన్ వాళ్లు డబ్బులు ఇచ్చారు. మాదిరి దేవేందర్ రాజు గారికి రుణపడి ఉంటామని కొటేశ్వరి కృతజ్ఞతలు తెలిపింది. కష్టాల్లో వున్నవారికి అండగా నిలిచేలా దేవేందర్ రాజు గారి చొరవతో ఈ ఫౌండేషన్ ద్వారా సేవలు అందిస్తున్నామని MDR ఫౌండేషన్ ప్రెసిడెంట్ మధు సూదన్ తెలిపారు.