పలు వాహనాలను తనిఖీ చేసిన ఎం వి ఐ వరప్రసాద్

సత్యసాయి జిల్లా కదిరి తాలూకా.తనకల్లు మండల పరిధిలోని మల్లీపల్లి ప్రధాన జాతీయ రహదారి పై మంగళవారం నాడు పలు వాహనాలను ఎంవిఐ వరప్రసాద్ తనిఖీ చేశారు. అధిక లోడుతో వెళుతున్న వాహనాలను తనిఖీ చేసి టన్ ఏజ్ పరిశీలించారు. అధిక లోడు కలిగిన వాహనాలకు జరిమానా విధించారు. అదేవిధంగా ఈయన మాట్లాడుతూ వాహనాల్లో వాహన పరిమితికి మించి అధిక లోడు వేయడం నేరమన్నారు. అధికలోడు వేయడంతో ఒక్కొక్కసారి పలు ప్రమాదాలకు గురవుతాయని ఆయన అన్నారు. అంతేకాకుండా రాత్రిపూట ప్రయాణించే వాహన చోధకులు నిద్రమత్తుతో వాహనాన్ని నడపకుండా వాహనాన్ని ఆపి మంచినీటితో ముఖం కడుక్కొని అవసరమైతే కాఫీ టీ లాంటిది సేవించి తర్వాత ప్రయాణించాలన్నారు. ద్విచక్ర వాహనదారులు మద్యం తాగి వాహనం నడపరాదన్నారు. హెల్మెట్ ధరించాలని సరైన రికార్డులు కలిగి ఉండాలని తెలిపారు. కారు ఇతర వాహనాలు నడిపేవారు సీట్ బెల్ట్ ధరించాలని తెలిపారు. ఈ తనికీలో ఎంవిఐ వరప్రసాద్ తోపాటు ఆయన సిబ్బంది ఉన్నారు.