బీసీవై పార్టీ తరఫున బీఫామ్ తీసుకున్న ఎమ్మెల్యే అభ్యర్థి డాకరాజు

జన చైతన్య న్యూస్ అనంతపురం జిల్లా. తాడపత్రి నియోజకవర్గం భారత చైతన్య యువజన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బెడుదూరు డా కరాజుని నియమించారు. బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ తాడపత్రి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన డాకరాజుకి బీఫామ్ అందించారు. ఈ కార్యక్రమంలో బిసివై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ పార్టీ యొక్క సిద్ధాంతాలను వారికి వివరించారు. ఎమ్మెల్యే అభ్యర్థి డాకరాజు మాట్లాడుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రామచంద్ర యాదవ్ కి కృతజ్ఞులై ఉంటానని నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.