టిడిపిని వీడి వైఎస్ఆర్సిపిలో చేరిక*

టిడిపిని వీడి వైఎస్ఆర్సిపిలో చేరిక*

*టిడిపిని వీడి వైఎస్ఆర్సిపిలో చేరిక*

*తలుపుల:*

               కదిరి నియోజకవర్గంలో టిడిపిని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరికల పరంపర కొనసాగుతోంది. రాష్ట్రంలో నిరుపేదల అభివృద్ధికి కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచి ఆయనను రెండవసారి ముఖ్యమంత్రి చేయడానికి సేవాదళ్ జోనల్ ఇంచార్జి డీకే బాబు ఆధ్వర్యంలో మేము పార్టీలో చేరుతున్నామని తలుపుల మేజర్ పంచాయతీకి చెందిన షేక్షా వలీ, మైనుద్దిన్, మాలిక్ భాష, మహబూబ్ భాష, సైఫుద్దిన్, ఖలీల్ భాష, బాబా ఫకృద్దీన్, షార్ఫద్దిన్ తదితరులు పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలో వారికి ఎమ్మెల్యే అభ్యర్థి బి.ఎస్ మక్బూల్, కదిరి అసెంబ్లీ ఎన్నికల ఇంచార్జ్ పూల శ్రీనివాసరెడ్డిలు కండువా వేసి పార్టీలకు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మాయమాటలు చెబుతూ మరోసారి రాష్ట్ర ప్రజలని మోసం చేయాలని చూస్తున్న టిడిపి కూటమిని నమ్మి మోసపోవద్దని వారికి సూచించారు. అదేవిధంగా నిరంతరం రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని రెండవసారి ఆశీర్వదించడానికి ఫ్యాను గుర్తుకు ఓటు వేసే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.