ఘనంగా జరిగిన అమృత వెక్టర్ ఆర్ట్స్ ప్రారంభోత్సవం
ఘనంగా జరిగిన అమృత వెక్టార్ ఆర్ట్స్ ప్రారంభోత్సవం..
కృష్ణాజిల్లా, పెనమలూరునియోజకవర్గం ఉయ్యూరు మండలo
ఉయ్యూరు గ్రామంలో
ఆర్యవైశ్య కళ్యాణ మండపం ఎదురువీధిలో...
ప్రముఖ గ్రాఫిక్ డిజైనర్ *డిజె శివ* మరియు సీనియర్ పబ్లిసిటీ డిజైనర్ *అనిల్ కొడాలి*ఆధ్వర్యంలో నెలకొల్పబడిన *అమృత వెక్టార్ ఆర్ట్స్* ఈరోజు ఘనంగా ప్రారంభించబడినది.
ఈ కార్యక్రమానికి అమృత హాస్పిటల్ అధినేత డాక్టర్శ్రీకాంత్ తోట మరియు ఏపీఎస్ఆర్టీసీ కార్మిక పరిషత్ ప్రచార కార్యదర్శి *
యార్లగడ్డ రమేష్* ముఖ్య అతిథులుగా విచ్చేసి, రిబ్బన్ కత్తిరించి *అమృత
వెక్టార్ ఆర్ట్స్* ని ప్రారంభించారు.
తదుపరి డాక్టర్ శ్రీకాంత్ తోట మాట్లాడుతూ... కృషి పట్టుదల తో పాటు ఎంతో నైపుణ్యం కలిగిన ఇద్దరు డిజైనర్స్ కలిసి మొదలుపెట్టిన ఈ క్రియేటివ్ ప్రయాణం దిగ్విజయంగా ముందుకు సాగాలని, వారిద్దరూ భవిష్యత్తులో ఇంకా ఎత్తు ఎదగాలని ఆకాంక్షించారు.
అలాగే యార్లగడ్డ రమేష్ మాట్లాడుతూ... డిజె శివ, అనిల్ కొడాలి వీరిద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. పనిని పనిలా కాకుండా అదొక యజ్ఞం లా భావించే వారి చిత్తశుద్ధికి నేనెప్పుడూ ముగ్దుడ్ని అవుతూనే ఉంటాను.
వీరు ఇరువురి ప్రయత్నం భవిష్యత్తు డిజైనర్స్ కి ఆదర్శంగా ఉండాలని, మీరు ఇంకా ఇంకా ఉన్నత స్థానాలకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నారు.