కార్మిక కర్షక ఐక్యపోరాటాలే రైతాంగసమస్యలకుపరిష్కారం

విజయవాడ -జన చైతన్య(తమ్మిన గంగాధర్ ):- రైతు నేతలు పిలుపువిజయవాడ కార్మిక, కర్షక ఐక్యపోరాటాలతో వ్యవసాయ రంగం ఏదుర్కొంటున్నా సమస్యలను పరిష్కరించుకో గలుగుతామని జాతీయ రైతు నేతలు పిలుపునిచ్చారు. నగరంలోని పూర్ణనందంపేట ఎస్ కె చాంద్ హాల్లో వ్యవసాయ రంగం ఏదుర్కొంటున్నా సంక్షోభం సవాళ్లు పరిష్కారాలు అనే అంశంపై సెమినార్ యంయల్ పిఐ రెడ్ ఫ్లాగ్10వ మహాసభలు సందర్భంగా నిర్వహించారు. ఈ సభలో జాతీయ రైతు సంఘాల నాయకులు థామస్ ఫ్రెడ్ఢీ, కెవి ప్రసాద్, రాజ్ మోహతా, యం.వెంకటరెడ్డి, శివ ప్రసాద్, సి.శేఖర్, ఆదేశాల బన్సోడే తదితరులు పాల్గొని ప్రసంగించారు. రాజకీయాలకు అతీతంగా అతిపెద్ద రైతాంగ ఉద్యమాన్ని నిర్మాణం చేయటం ద్వారా రైతాంగ సమస్యలు పరిష్కారం చేసుకోగలమన్నారు. ఇటీవల దేశరాజధాని నడివీధుల్లో ఏడాది పాటు రైతాంగ పోరాట ఫలితంగా వ్యవసాయ బిల్లు చట్టాలను తిప్పికొట్టగలిగామని గుర్తు చేశారు. అదే తరహా ఉద్యమాలను మరోసారి నిర్మాణం చేయవలసిన తక్షణ అవసరమని రైతు నేతలు పిలుపునిచ్చారు. సభకు ఎఐకెఎస్ జాతీయ కన్వీనర్ బసవలింగప్ప అధ్యక్షత వహించారు.