సమస్యల పరిష్కారం కోసంఅంగన్ వాడీల సమ్మె

సమస్యల పరిష్కారం కోసంఅంగన్ వాడీల సమ్మె

తనకల్లు మండల కేంద్రంలోనీ ఎంపీడీవో కార్యాలయం వద్ద బుధవారం తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మెలో పాల్గొంటున్న వారిని ఉద్దేశించి రైతు సంఘం జిల్లా నాయకులు బడా సుబ్బిరెడ్డి,మాట్లాడుతూ

దేశంలో మాతృ మరణాలు, తగ్గించడానికి,పోషకాహారాన్ని

అందించటానికి పిల్లల సమగ్ర అభివృద్ధి పధకం ద్వారా కార్యకర్తలు పనిచేస్తున్నారని గుర్తుచేశారు.ఈ

పధకాన్ని మరింత బలోపేతం చేస్తామని ప్రకటించిన కేంద్రంలోని మోడీ ప్రభుత్వందానికి

తగిన నిధులు కేటాయించకుండా ప్రైవేటు సంస్థలకు అప్పచెపుతోంది. రాష్ట్రంలోని వైసిపి

ప్రభుత్వం పోషకాహారం సరఫరా చేసే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా జాప్యం

చేస్తోంది. అంగన్వాడీ కేంద్రాలకు ఎక్కువ కాలం నిల్వ ఉంచిన పాల ప్యాకెట్ లనుసరఫరా

చేస్తోంది. ధరలు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు

పెంచడంలేదు.

కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పిల్లల అభివృద్ధి పధకానికి (ఐసిడిఎస్)

తగిన నిధులు కేటాయించనందున మన దేశంలో ఇంకా పోషకాహార లోపం కొనసాగుతోందనీ వెంటనే అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు బడా సుబ్బిరెడ్డి, సిఐటియు జిల్లా కౌన్సిల్ సభ్యులు ఒంటెద్దు వేమన్న, రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు శివన్న,, అంగన్వాడి నాయకులు భాగ్యమ్మ, పద్మావతి, అంగన్వాడి కార్యకర్తలు భారతి, లక్ష్మీదేవి, సుజాత, తదితరులు పాల్గొన్నారు.