విద్యార్థి సంఘాల నాయకుల మద్దతు కోరుతున్న స్వతంత్ర అభ్యర్థి రాజేష్
వచ్చే ఎన్నకల్లో AISA ,RYA ,NSUI నాయకుల మద్దతు కోరిన రాజేష్ ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతు కదిరి నియోజక వర్గ స్వతంత్ర అభ్యర్థి గా పోటి చేస్తున్నను.కావున ఈ సందర్భంగా విద్యార్థి నాయకులతో చర్చించి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని మీ అందరి మద్దతు కావాలని భవిష్యత్తులో విద్యారంగంలో నెలకొన్న సమస్యలపై పోరాటాలు చేసి సదించుకుకుందాముని విద్యార్ధి సంఘాల నాయకులను కోరారు.
రానున్న ఎన్నికల్లో ఇప్పుడున్న విద్యార్థులు మొదటి సారి ఓటు వేస్తున్నారు. కావున అన్ని ఆలోచించి మన భవిష్యత్తు కోసం ఓటు వేసే విధంగా ఉండాలని సూచించారు. మన ఓటు వేస్తే మన నియోజవర్గ అభివృద్ధి చెందాలని నాయకుల అభివృద్ధి కోసం కాదు. కావున మీ మొదటి ఓటు నాకు వేసి కదిరి అభివృద్ధికి తోడ్పడే విధంగా విద్యార్థులు అందరికీ తెలియజేయాలని విద్యార్థి నాయకులకు మద్దతు ఇవ్వాలి కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో AISA జిల్లా అధ్యక్షులు నరసింహ,NSUI నాయకులు ఉపేంద్ర,AISA జిల్లా ఉపాధ్యక్షుడు ప్రదీప్,AISA నాయకులు పృధ్వీ,RYA నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.