అక్రమంగా ఇసుక తరలింపు ట్రాక్టర్ ను సీజ్ చేసిన ఎస్ ఐ హేమాద్రి.
(పుట్లూరు జనచైతన్య న్యూస్) అక్రమంగా ఇసుక తరలింపు ట్రాక్టర్ ను సీజ్ చేసిన ఎస్ ఐ హేమాద్రి. పుట్లూరు మండల పరిధిలోని మంగళవారం అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ ను పట్టుకొని పోలీసులు సీజ్ చేశారు. అనంతరం ఎస్ఐ హేమాద్రి మాట్లాడుతూ మండల పరిధిలోని ఏ కొండాపురం వద్ద నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ ను సీజ్ చేసినట్లు తెలియజేశారు. అదేవిధంగా పెద్దపప్పూరు మండలం తిమ్మన చెరువు గ్రామానికి చెందిన మహేశ్వర్ రెడ్డి పై కేసు నమోదు చేసి ట్రాక్టర్ ను మైన్స్ అధికారులకు అప్పగించామని ఎస్ఐ హేమాద్రి తెలిపారు.