సొంత గూటికి చేరిన అమడగూరు సర్పంచు షేక్ షబ్బీర్

*పల్లె జిమ్మికులకు ఎదురుదెబ్బ..*
*సొంతగూటికి చేరిన అమడగూరు సర్పంచ్ షేక్ షబ్బీర్*
*పుట్టపర్తి* నియోజకవర్గం *ఆమడ గూరు* మండలం *అమడగూరు* వైసీపీ సర్పంచ్ షబ్బీర్ గారిని మభ్యపెట్టి తెదేపాలో చేర్చుకున్నారు.
అయితే కొద్ది గంటల్లోనే పల్లె జిమ్మిక్కులకు చెక్ పడింది.
పుట్టపర్తి శాసనసభ్యులు *దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి* గారి ఆధ్వర్యంలో *షబ్బీర్* తిరిగి సొంత గూటికి చేరారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పల్లె రఘునాథ్ రెడ్డి తనను మధ్య పెట్టి మాయ మాటలు చెప్పి పార్టీలో చేర్చుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తానెప్పుడూ వైసిపి పక్షమేనని, పుట్టపర్తి నియోజకవర్గంలో శ్రీధరన్న విజయం కోసం పని చేస్తానని, జగనన్న మరోసారి ముఖ్యమంత్రి చేసుకుంటామని అన్నారు.
కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.