సత్తయ్య ని కలిసిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్
*తెల్లాపూర్ కౌన్సిలర్ భరత్ మరియు సీనియర్ నాయకులు సత్తయ్య ని* *కలిసిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్*
కాంగ్రెస్ లోకి ఆహ్వానించిన నీలం మధు*
సానుకూలంగా స్పందించి*
సంపూర్ణ మద్దతు ప్రకటించిన కౌన్సిలర్*
(జన చైతన్య న్యూస్ సంగారెడ్డి ప్రతినిధి) ఏప్రిల్ 13
తెల్లాపూర్ మున్సిపల్ ఇండిపెండెంట్ కౌన్సిలర్ కొల్లూరి భరత్, ఆయన తండ్రి సత్తయ్య ను మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. ఇందుకు వారు సానుకూలంగా స్పందించారు. ఈ ఎంపీ ఎన్నికలలో సంపూర్ణ మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా భరత్, సత్తయ్య నీలం మధుకు భరోసా ఇచ్చారు. ప్రజాసేవ చేసేందుకు ప్రజల ముందుకు వస్తున్నానని, ఈ ప్రాంతం నుంచి సహాయ సహకారాలు అందించి, తన గెలుపునకు తోడ్పడాలని నీల మధు ఈ సందర్భంగా వారిని కోరారు. నీలం మధు వెంట తెల్లాపూర్ మున్సిపల్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి, కుమార్ గౌడ్,బాబు గౌడ్,గడ్డం శ్రీశైలం, రుద్రారం వెంకన్న,మధు, పాండు, బిక్షపతి, రాకేష్ గౌడ్,తదితరులు ఉన్నారు.