బాల్య వివాహాలపై అవగాహన

బాల్య వివాహాలపై అవగాహన

బాల్య వివాహాలపై అవగాహన

జన చైతన్య న్యూస్ - నార్పల 

 అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలో విద్యాశాఖ కార్యాలయం యందు మంగళవారం ప్రధానోపాధ్యాయులకు ఎంఈఓలు క్రిష్ణయ్య,నారపరెడ్డి ఆధ్వర్యంలో నార్పల ఎస్సై సాగర్ బాల్యవివాహాలపై అవగాహన సదస్సు నిర్వహించడమైనది.ఈ సందర్భంగా ఎంఈఓ లు మరియు ఎస్సై సాగర్ మాట్లాడుతూ బాల్యవివాహాలను ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, బాల్య వివాహాలు అరికట్టడంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని తెలియజేశారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై పాఠశాలలో విద్యార్థులకు ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలని తెలిపారు. బాల్య వివాహాల నిర్మూలనకు టోల్ ఫ్రీ నెంబర్ 1098 కు ఫోన్ చేసి బాల్య వివాహాలు నిర్మూలించాలని తెలిపారు. బాల్యవివాహాల వల్ల అమ్మాయి, అబ్బాయి జీవితాలు నాశనం అవుతున్నాయన్నారు. 18 సంవత్సరాల లోపు బాలికలకు, 21 సంవత్సరాల లోపు అబ్బాయిలకి వివాహం చేస్తే పెళ్లి కుమారునికి వారి తల్లిదండ్రులకు పెళ్లిలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. మైనర్ బాలికను వివాహం చేసుకొని తనతో సంసారం చేసిన భర్తకు ఫోక్స్ చట్టం కింద పది సంవత్సరాలు జైలు శిక్ష కూడా విధించడం జరుగుతుందని తెలిపారు. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు చదువుకునే వయసులోనే వివాహం చేసి చిన్నారుల జీవితాలతో ఆడుకుంటున్నారన్నారని రాష్ట్ర ప్రభుత్వం బాల్యవివాహాలను అడ్డుకట్ట వేసేందుకు అనేక కార్యక్రమాలను చేపడుతుందని ఎక్కడైనా బాల్యవివాహాలు జరుగుతున్నట్లు ఎవరి దృష్టికి వచ్చిన హెల్ప్ లైన్ నెంబర్ ల ద్వారా వెంటనే సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేయాలని తెలిపారు. బాల్య వివాహం నేరం చట్టం ప్రకారం శిక్షార్హులు, బాల్య వివాహం చేసిన చేసుకున్న ప్రోత్సహించిన రెండేళ్ల జైలు లక్ష రూపాయల జరిమానా అనే నినాదాలతో ఉపాద్యాయులు తల్లిదండ్రుల్లో విద్యార్థుల్లో అవగాహన కల్పించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ 1 యమ్. క్రిష్ణయ్య, ఎంఈఓ 2 నారపరెడ్డి, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొనడం జరిగింది.