పసుపు మయంగా మారిన నాయనకోట*
**పసుపు మయంగా మారిన నాయనకోట*
*నాయనకోట తండాలో వైసీపీ ఖాళీ**
*మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి సమక్షంలో టిడిపిలోకి చేరిన 110 వైసీపీ కుటుంబాలు*
*ఓడి చెరువు:03*
ఓడి చెరువు మండలం కొండకమార్ల పంచాయతీలోని నాయన కోట పసుపుమయమైంది. నాయనకోట తాండా లో శుక్రవారం వైసీపీ నుంచి 110 కుటుంబాలు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి సమక్షంలో టీడీపీ కండువా కప్పుకుని టీడీపీలో చేరారు. నాయనకోట తాండా ఒకానొకప్పుడు కంచుకోట అని ఈరోజు మొత్తం టీడీపీలో చేరిందని గుర్తు చేశారు. గ్రామానికి ఎల్లవేళలా తన సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని ఇక్కడి ప్రజల రుణం తీర్చుకోలేనిదన్నారు .టీడీపీ తోనే అభివృద్ధి సాధ్యం అని భావించి వైసీపీ నుంచి టిడిపిలోకి రావడం ఎంతో అభినందనీయం అన్నారు . గెలిచిన వెంటనే ఈ గ్రామానికి వచ్చి ఏ అవసరం ఉన్న సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ గ్రామానికి విచ్చేసిన మాజీ మంత్రికి స్థానిక ప్రజలు నీరాజనాలు పలుకుతూ పూల వర్షం కురిపిస్తూ అపూర్వ స్వాగతం పలికారు. యువకులు నృత్యాలు చేస్తూ ఆనందోత్సవాల మధ్య బాణా సంచా కాల్చి అభిమానం చాటుకున్నారు. గ్రామంలోనీ పుర వీధుల్లో రోడ్ షో నిర్వహించారు. ఎక్కడ చూసినా ప్రజలు పూల వర్షం కురిపిస్తూ ఎప్పుడు లేని విధంగా తమ అభిమానాన్ని చాటుకున్నారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి తో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షులు అంజినప్ప , ఎన్నికల పరిశీలకులు డీఎ న్ మూర్తి, జన సేన పార్టీ ఇన్ ఛార్జ్ పత్తి చంద్రశేఖర్, లాయర్ రాజశేఖర్ ,కన్వీనర్ జయ చంద్ర, మాజీ జెడ్పీటీసీ పిట్టా ఓబుల్ రెడ్డి,యువ నాయకుడు ఎద్దుల ప్రమోద్ రెడ్డి , అక్కులప్ప నాయక్ , వెంకటేష్ నాయక్ ,కాలే నాయక్,శంకర్ నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ, పుట్టపర్తిలో అవినీతి అనకొండ మన ఎమ్మెల్యే దుద్దే కుంట శ్రీధర్ రెడ్డి అని అభివర్ణించారు. పుట్టపర్తి నియోజకవర్గంలో వైసిపి ఎమ్మెల్యే శ్రీధర్ హయాంలో జరిగిన అవినీతి గత చరిత్రలో ఏ ఎమ్మెల్యే కూడా చేయలేదని పేర్కొన్నారు. ఎక్కడ చూసినా భూ దందాలు వసూళ్లు ఇసుక మద్యం అరాచకాలు వేధింపులు సాగిస్తూ అవినీతి పరుడిగా శ్రీధర్ ముద్ర వేసుకున్నారని గుర్తు చేశారు. ఇలాంటి ఎమ్మెల్యేలు గెలిపిస్తే పుట్టపర్తి నియోజకవర్గం అవినీతి కొండగా మారుస్తాడని హెచ్చరించారు. రాష్ట్రంలో సైకో పాలనతో రాష్ట్రం సర్వనాశనం అయిందని పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల భవిష్యత్తు కోసం టిడిపి అధికారంలోకి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు పుట్టపర్తి నియోజకవర్గం లో టిడిపి అభ్యర్థి పల్లె సింధూరమ్మ, హిందూపురం పార్లమెంట్ టిడిపి అభ్యర్థి పార్థసారథి సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు శరత్ రెడ్డి ,కొత్త చెరువు టీడీపీ కన్వీనర్ శ్రీనివాసులు, వల్లేపి సోమశేఖర్ ,మాజీ కన్వీనర్ రాజారెడ్డి ,తుమ్మల మహబూబ్ బాషా , పొగాకు జాకీర్ ,టిడిపి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.