డయేరియా వ్యాధి పై పటిష్ట చర్యలు చేపట్టాలి,డాక్టర్ శ్రీ వాణీ

డయేరియా వ్యాధి పై పటిష్ట చర్యలు చేపట్టాలి,డాక్టర్ శ్రీ వాణీ

డయేరియా వ్యాధి పై పటిష్ట చర్యలు చేపట్టాలి,డాక్టర్ శ్రీ వాణీ

జనచైతన్య న్యూస్-పుట్లూరు

అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం పుట్లూరు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి డాక్టర్ శ్రీవాణి ఆధ్వర్యంలో తక్కళ్లపల్లి గ్రామంలో అతిసార డయేరియా కు సంబంధించిన వాల్ పోస్టర్లను సోమవారం విడుదల చేశారు. అనంతరం ఎమ్ ఎల్ హెచ్ బి ఆదిలక్ష్మి హాజరై మాట్లాడుతూ ఐదేళ్ల పిల్లలు ఎక్కువగా డయేరియా బారిన పడుతున్నారన్నారు . అదేవిధంగా గ్రామ ప్రజల కు ఈ డయేరియా వ్యాధి గురించి సలహాలు సూచనలు తెలియజేశారు. అంతేకాకుండా ప్రతి గ్రామాలలో కూడా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎల్ ఎమ్ హెచ్ బి ఆదిలక్ష్మి, ఆశ వర్కర్ సుబ్బమ్మ, గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు.