ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
జనచైతన్య న్యూస్-తనకల్లు
సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనకల్లు మండలంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆదేశాల మేరకు తనకల్లు మండలం దిగువ తొట్టిపల్లి పంచాయతీ ముల్లోళ్ళపల్లి, మబ్బు వారి పల్లి గ్రామాల నందు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేయడం జరిగింది. ఏదైతే ఎన్డీఏ కూటమి సూపర్ సిక్స్ అమలులో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమం విజయవంతంగా అమలు చేస్తున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులు పెన్షనర్లు పాలాభిషేకం చేయడం జరిగింది. కార్యక్రమంలో తెలుగు యువత మండల అధ్యక్షుడు కావడి ప్రవీణ్ కుమార్, తెలుగుదేశం పార్టీ నాయకులు వెంకటేశ్వర్లు, తొట్లి నారాయణరెడ్డి, తొట్లి కృష్ణారెడ్డి, మబ్బు అనిల్ కుమార్ రెడ్డి, కొండారెడ్డి, లొట్టారెడ్డి, గోపాల్ రెడ్డి, మాదం చెట్టి సుధాకర్, రామచంద్ర, హసనాపురం శ్రీనివాసులు ,భీమన్న, అప్పల, సుభాష్ రెడ్డి, పంచాయితీ సిబ్బంది చిన్న కృష్ణ, జీపు వెంకటేష్, పర్జన్ తదితరులు పాల్గొన్నారు.