అంగరంగ వైభవంగా చౌడేశ్వరి దేవి జ్యోతి మహోత్సవం:
అంగరంగ వైభవంగా చౌడేశ్వరి దేవి జ్యోతి మహోత్సవం:
సత్యసాయి జిల్లా అమడగూరు ఏప్రిల్ 27:జనచైతన్య న్యూస్ :అమడగూరు లో వెలసిన చౌడేశ్వరిదేవి జ్యోతి మహోత్సవం అంగరంగ వైభావంగా నిర్వహిస్తున్నట్టు ఆలయ ధర్మకర్త పొట్టా పురుషోత్తంరెడ్డి తెలిపారు ప్రత్యేక అలంకరణలో అమ్మవారు ఊరేగింపుగా ఉట్టిదగ్గరకు వెళ్ళి అక్కడినుండి, ప్రారంభమై జ్యోతి తో పాటు అమ్మవారు మంగళ వాయిద్యాల నడుమ తోగట వీర క్షత్రియులు చౌడేశ్వరి ఖడ్గ పద్యాలు ఆలపిస్తూ ఊరేగింపుగా పుర వీదులగుండా గుడిదగ్గరకు చేరుకుంటారు , ప్రతి ఏటా కన్నుల పండుగగా సాగె ఈ జ్యోతి మహోత్సవానికి చుట్టుపక్కల గ్రామాల భక్తాదులే కాకుండా కర్ణాటక నుండి పెద్ద సంఖ్యలో వచ్చి భక్తులు అమ్మవారి ని దర్శించుకుని, అన్నప్రసదాలు స్వీకరించారు.ఈ సందర్బంగా ఆలయ ధర్మకర్త పొట్టా పురుషోత్తంరెడ్డి మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు