చెరువులను తలపిస్తున్న భవానిపురం హౌసింగ్ బోర్డ్, లేబర్ కాలనీలు అర్ధరాత్రి నుండి భారీగా కురిసిన వర్షం

చెరువులను తలపిస్తున్న భవానిపురం హౌసింగ్ బోర్డ్, లేబర్ కాలనీలు అర్ధరాత్రి నుండి భారీగా కురిసిన వర్షం
జన చైతన్య న్యూస్- విజయవాడ
పశ్చిమ నియోజకవర్గంలో పలు ప్రాంతాలు వర్షపు నీటితో నిండి చెరువులను తలపిస్తున్నాయి. భవానిపురం పాత హౌసింగ్ బోర్డ్ కాలనీ, వెల్లంపల్లి కాలనీ, అప్నా బజార్, పాత పోలీస్ స్టేషన్, 43 వ డివిజన్ ట్రాన్స్పోర్ట్ వీధి పరిసర లోటట్టు ప్రాంతాలు భవానిపురం లేబర్ కాలనీ పలు ప్రాంతాలు కాలువలలో చెత్తాచెదారం పేరుకుపోయి ఆ ప్రాంతమంతా మురికి నీటితో జలమయమై స్థానికులు అగచాట్లు పడుతున్నారు. ఈ ప్రాంతాలలో పాదచారులు వాహనదారులు వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు ఇంకా కొనసాగడంతో ఆ ప్రాంతాలలో నివసిస్తున్న వారి ఇళ్లల్లోకి మురుగు నీరు చేరడంతో ఆ ఇళ్లల్లో నివసిస్తున్న ప్రజలు మంచాల పైనే ఆసీనులై భరించలేని దుర్వాసనతో స్థానికులు నాన్న అగచాట్లు పడుతున్నారు. అధికారుల సహాయ చర్యల కోసం వేచి చూస్తున్నారు, 42వ డివిజన్లో పర్యటించిన యేదుపాటి రామయ్య బృందం, 42 వ డివిజన్ పరిధిలోని పాత హౌసింగ్ బోర్డు కాలనీ, 300 & 450 ఎస్ ఎఫ్ టి కాలనిలో వర్షపు నీటి వల్లన మునిగిన ఇళ్లను పరిశీలిస్తున్న మాజీ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య, శానిటరీ ఇన్స్పెక్టర్ బ్రహ్మారెడ్డి, నెలకుర్తి వెంకట్రావ్, సీత చంద్రశేఖర్, బుజ్జి, బ్రహ్మరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.